Latest

Loading...

100లోపు విద్యార్థులున్న పాఠశాలల విలీనం వద్దు...!!

News

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాఠశాలల విలీనం పై మరోసారి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాఠశాలల విలీనం పై కొన్ని చోట్ల వ్యతిరేకత వచ్చిన విషయం తెల్సిందే..


అయితే తాజాగా రాష్ర్టంలో100లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలో నుంచి ప్రాథమిక పాఠశాలల 3,4,5 తరగతులను విలీనం చేయవద్దని విద్యాశాఖ నిర్ణయించింది. ఏ యాజమాన్య పాఠశాలను అదే యాజమాన్య పాఠశాలలో కలపాలని, గిరిజన సంక్షేమ పాఠశాలలను అసలు విలీనం చేయవద్దని తెలిపింది.


20 మంది కన్నా తక్కువ విద్యార్థులన్న ప్రాథమిక బడుల నుంచి 3,4,5 తరగతులను విలీనం చేయరు. అలాగే హైస్యూల్‌ స్థాయిలో వెయ్యి మంది కన్నా ఎక్కువ పిల్లలు ఉన్న వాటిల్లోనూ 3,4,5 తరగతులను కలపవద్దని విద్యాశాఖ నిర్ణయించింది. కాగా ఎయిడెడ్‌ పాఠశాల విలీనం పై ఏపీలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆతర్వాత ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులును విద్యార్థులకు అందజేస్తే విలీనం అవసరం లేదని ప్రకటించింది.

No comments

Powered by Blogger.