Latest

Loading...

1st Omicron case AP : ఏపీలో అడుగుపెట్టిన ఒమిక్రాన్.. నిర్ధారించిన అధికారులు.. ఎక్కడంటే...?

1st Omicron case AP

 First Omicron Case in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఒమిక్రాన్ (Omicron) టెన్షన్ మొదలైంది.


తొలి కేసు నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసు నమోదు అవ్వడం ఇదే మొదటిది. ఇటీవల లండన్ (London) నుంచి తిరిగి శ్రీకాకుళం (Srikakulam) చేరుకున్న.. జ్వరం ఇతర కరోనా లక్షాలను కనిపించాయి. అతడికి అప్పటికే కరోనా పాజిటివ్ (Corona Positive) అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఒమిక్రాన్ అనే అనుమానంతో అతడి శాంపిల్స్ ను హైదరాబాద్ (Hyderabad) కు పంపారు. అయితే అతడికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్టు అధికారులు ప్రకటించారు. అతడికి ప్రస్తుతం ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్య లేనప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యగా శ్రీకాకుళం రిమ్స్ కు తలరించారు. అక్కడి చికిత్స అందిస్తున్నారు. ఏపీలో తొలి ఒమిక్రాన్ నమోదు అవ్వడంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది.


ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది అనే విషయాన్ని తహశీల్దార్ ఆదిబాబు న్యూస్ 18 ప్రతినిధికి చెప్పారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఉమిలాడలో ఈ తొలి ఒమిక్రాన్ కేసు నమోదు అయ్యింది. అయితే మరికొంతమంది ఫలితాలు రావాల్సి ఉంది. దీంతో ఏపీలో ఒమిక్రాన్ దాడి మొదలైనట్టే అని అధికారులు కాస్త కలవరపడుతున్నారు.

ప్రస్తుతానికి తొలి కేసు నమోదైనా.. ఇంకా భయం పెరుగే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల సుమారు 8 వేల మందికి పైగా ఏపీ చిరునామాతో విదేశాల నుంచి వచ్చారు. వారిలో 3 వేల మంది మినహా మిగిలిన వారి ఆచూకీ ఎక్కడ అన్నది తెలియడం లేదు. గుర్తించి వారిలో కొంతమందికి పాజిటివ్ అని నిర్ధారణ అయినా.. చాలమందిలో ఒమిక్రాన్ లక్షణాలు లేవు .. భయడాల్సిన అవసరం లేదని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. అయితే అందులో విదేశం నుంచి శ్రీకాకుళం వచ్చిన ఓ వ్యక్తికి వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దాన్ని ఒమిక్రాన్ గా అధికారులు నిర్ధారించడం ఆందోళన పెంచుతోంది.

ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఇప్పటికే భారత్ ను కూడా వెంటాడుతోంది. ఇఫ్పటికే దేశంలో 20కి పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాలకు వ్యాప్తించే ప్రమాదం ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతున్నాయి. నిన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఊపిరి పీల్చుకున్నా.. తాజాగా ఓ కేసు నమోదు కావడం కలవర పెడుతోంది. ప్రస్తుతం రిమ్స్ ఆసపత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నారు.

ఒమిక్రాన్ తో అప్రమత్తత తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. గతంలో వచ్చిన అన్ని కరోనా వైరస్​ల కంటే సెకండ్​ వేవ్​లో భారత్​లో అల్లకల్లోలం సృష్టించిన డెల్టా రకం అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ వైరస్​పై పరిశోధనలు మొదల పెట్టారు. అయితే ఈ ఒమిక్రాన్​ వేరియంట్​ డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు చెబుతుండడం ఆందోళన పెంచుతోంది.

No comments

Powered by Blogger.