Latest

Loading...

ALERT : ఏపీ కి మూడు రోజుల పాటు వర్షాలు....!!

Rain

 ఏపీకి మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న తూర్పు గాలులలో ఏర్పడిన ద్రోణి, నైరుతి బంగాళా ఖాతము దగ్గర నున్న ఉత్తర శ్రీలంక తీర ప్రాంతం నుండి ఉత్తర బంగాళా ఖాతము లోని మధ్య ప్రాంతాల వరకు వ్యాపించి ఈరోజు శ్రీలంక నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి ౦.9 కిలోమీటర్లు ఎత్తులో వ్యాపించియున్నదని వాతావరణ శాఖ తెలిపింది.


వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ సూచించింది.


ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని..రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి వర్షాలు ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చొట్ల కురిసే అవకాశముందని పేర్కొంది వాతావరణ శాఖ.

No comments

Powered by Blogger.