Andhra Pradesh: మాంసం ప్రియులకు గుడ్ న్యూస్..అక్కడ మటన్ కేజీ 50 రూపాయలే...!!..
Andhra Pradesh: మాంసం ప్రియులకు గుడ్ న్యూస్. ఆ ప్రాంతంలో కేజీ మటన్ 50 రూపాయలే(Kg Mutton 50 Rupees). వ్యాపారస్తుల(Merchants) మధ్య నెలకొన్న పోటీ కస్టమర్లకు వరంలా మారింది.
చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో మటన్ ధరలు(Mutton Rates) ఒక్కసారిగా పడిపోయాయి. మటన్ షాప్ నిర్వాహకులు పోటీపడుతూ ధరలను తగ్గించారు. దీంతో మటన్ కేవలం 50 రూపాయలకు కిలో అమ్ముడు పోయింది. దీంతో కొనుగోలు దారులు పోటీపడ్డారు. ఒక్కొక్కరు ఐదు కిలోల నుంచి 10 కిలోల వరకు కొనుగోలు చేశారు.
చిత్తూరు జిల్లా(chittoor district) వాల్మీకిపురం గాంధీ బస్టాండు పక్కన మటన్ దుకాణాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ దుకాణ దారుడు కేవలం 300లకే మటన్ అమ్మడం మొదలుపెట్టాడు. దాంతో ఇతర షాపుల వారు పోటీతో. ఒకరి తర్వాత ఒకరు ధర తగ్గిస్తూ వచ్చారు. 300 నుంచి 200, 150, 100 నుంచి ఇలా చివరకు 50 తో స్థిరపడింది. దీంతో ఆదివారం సాయంత్రం 7 వరకు మటన్ షాపుల వద్ద గీరాకీ కొనసాగింది. ఆ ప్రాంతమంతా జనాలతో కిక్కిరిసిపోయింది. పంతానికి పోయి వ్యాపారులు నష్టాల్లో మునిగారు.
No comments