Anganwadi Jobs: అనంతపురం జిల్లాలో 365 అంగన్‌వాడీ పోస్టులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.....!!
Anganwadi Jobs: అనంతపురంలో జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేశారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన మహిళా అభివృద్ధి సంస్థ 16 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎంపిక విధానం ఎలా చేస్తారు.? పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 365 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* నోటిఫికేషన్‌లో భాగంగా అంగన్‌వాడీ కార్యకర్త, మినీ అంగన్‌వాడీ కార్యకర్త, అంగన్‌వాడీ సహాయకులు పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వివాహిత మహిళ అయి ఉండి, స్థానికంగా నివాసం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01.07.2021 నాటికి 21 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అంగన్‌వాడీ కార్యకర్తకు నెలకు రూ.11,500, మినీ అంగన్‌వాడీ కార్యకర్తకు నెలకు రూ.7000, అంగన్‌వాడీ సహాయకులకు నెలకు రూ.7000 చెల్లిస్తారు.
* అభ్యర్థులను సీడీపీఓలు నిర్వహించే డిక్టేషన్, ఇతర వివరాలను పరిగణన లోకి తీసుకొని ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 16-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
No comments