Latest

Loading...

AP Employees : ఏపీలో ఇవాళ్టి నుంచి ఉద్యోగుల పోరుబాట....!!!

AP Employees

 AP Employees : ఏపీలో ఉద్యోగులు నేటి నుంచి నిరసనబాట పడుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఇవాల్టి నుంచి అనేక రూపాల్లో ఆందోళన చేయనున్నారు.


ఇటీవల అమరావతి సచివాలయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన కార్యదర్శుల సమావేశంలో కూడా ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వం నుంచి స్పష్టతా రాలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం 3 జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించింది.


ప్రతి సమావేశంలోనూ సంఘాలు 11వ పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ముక్తకంఠంతో డిమాండ్‌ చేసినా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా, ఇటీవల పీఆర్సీపై సంప్రదింపులకు పిలిచి,,,,, అసలు పీఆర్సీ అంశమే లేవనెత్తలేదు. దీంతో ఉద్యమంతో తప్ప.. తమ సమస్యలకు పరిష్కారం లభించదని భావించాయి ఉద్యోగ సంఘాలు. కొన్ని వారాల కిందటే ఉద్యమం తప్పదంటూ.. ప్రకటించాయి. అయినా ప్రభుత్వం స్పందించక పోవడంతో ఉద్యమ కార్యాచరణ అమలుకు జేఏసీలు సిద్ధమయ్యాయి.

రాష్ట్రంలో ఉన్న13 లక్షల ఉద్యోగస్తుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో.. ఇవాల్టి నుంచి ఉద్యమ బాట పడుతున్నట్లు తెలిపారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బోప్పరాజు వెంకటేశ్వర్లు. ఉద్యోగుల కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమకు సంబంధం లేదన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు కూడా ఆలోచించాలన్నారు. తామేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. కరోనాలోనూ ప్రభుత్వానికి ఎంతో సహకరించామని గుర్తు చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోవడంతోనే.. తాము రోడ్లమీదికి వచ్చామన్నారు. ప్రజలు కూడా తమ ఇబ్బందులు తెలుసుకోవాలన్నారు బోప్పరాజు వెంకటేశ్వర్లు.

No comments

Powered by Blogger.