Latest

Loading...

AP New Capital: ఏపీ నూతన రాజధానిగా విశాఖ, ప్రకటన ఎప్పుడంటే.....!!

AP New Capital

 AP New Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నంకు ముహూర్తం దాదాపుగా ఖరారైనట్టు సమాచారం. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్న జగన్ మదిలో మరో వ్యూహం స్పష్టంగా ఉందని తెలుస్తోంది.


ఆ వ్యూహం ప్రకారం..


ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ఇంకా వెనక్కి తగ్గలేదు. కేవలం సాంకేతిక సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని మరింత సమగ్రమైన బిల్లును ప్రవేశపెట్టాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన. ఇందులో భాగంగానే ఏపీ మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది ప్రభుత్వం. త్వరలో సమగ్రమైన బిల్లును మరోసారి ప్రవేశపెడతామని స్పష్టమైన ప్రకటన చేసింది. ఇందులో భాగంగా కొత్త బిల్లును సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఏపీ రాజధానిగా విశాఖ ఉంటుందని..ఆ ప్రక్రియకు టైమ్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.


ఉగాది తరువాత ఏపీ రాజధానిగా విశాఖపట్నంను(Visakhapatnam) ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. శ్రీరామనవమి పండుగ నాడు అధికారిక ప్రకటన వెలువడవచ్చనేది వైసీపీ వర్గాల్నించి వస్తున్న సమాచారం. అయోధ్యకు రాముడు వచ్చిన రోజున నూతన రాజధాని ప్రకటన చేయడం సమంజసమనేది వైసీపీ నేతల అభిప్రాయం. కేవలం సాంకేతిక అంశాల పరిష్కారం కోసమే బిల్లును ఉపసంహరించుకున్న వైఎస్ జగన్(Ap cm ys jagan)..మనసులో మాత్రం విశాఖ రాజధానిగా వ్యూహం సిద్ధమౌతోందట. ఇటీవల ఏపీ మంత్రి ఒకరు ఇదే విషయాన్ని పరోక్షంగా చెప్పేశారు. ఉగాది తరువాత స్పష్టమైన ప్రకటన ఉంటుందన్నారు. విశాఖ రాజధాని అనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress party) ప్రభుత్వానికి ముందు నుంచీ ఉన్న ఆలోచన. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే ముందుకు వెళ్తోంది. సాంకేతిక అంశాల్ని పక్కనబెట్టి..మిగిలిన అంశాల్ని విశాఖ రాజధానిగా ముందుకు తీసుకెళ్లే ఆలోచన ప్రభుత్వానికి ఉందని తెలుస్తోంది.

No comments

Powered by Blogger.