Latest

Loading...

వరద బాధితులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు : సీఎం జగన్ కీలక ప్రకటన...!!

AP News

 ఇవాళ సిఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా.. వరద బాధితులకు వరాల వర్షం కురిపిస్తున్నారు. వరదల్లో ఇల్లు కోల్పోయిన అందరికి 5 సెంట్ల స్థలం లో ఇల్లు నిర్మిస్తామని ప్రకటన చేశారు సీఎం జగన్.


పొలాల్లో ఇసుక మేటలు తొలగించడానికి హెక్టారుకు 12,000 ఇస్తామని.. ఉపాధి హామీ కింద అందరికి ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు.


యువకులకు వెహికిల్ కోల్పోతే వారికి కూడా ఏదైనా చేస్తా…జాబ్ మేళా ఏర్పాటు చేసి ప్రైవేట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు సీఎం జగన్. 10 రోజుల్లో అన్ని సహాయ కార్యక్రమాలు ప్రారంభించి పూర్తి చేస్తామని.. ఊహించన విధంగా అన్నమయ్య ప్రాజెక్టులకు ఇన్ ఫ్లో వచ్చిన కారణంగా ఈ విపత్తు వచ్చిందని వివరించారు సీఎం జగన్.. ఈ రెండు ప్రాజెక్టులకు రే డిజైన్ చేసి నిర్మిస్తామని.. చెయ్యేరు పరివాహక ప్రాంతంలో గ్రామాలు ఉన్న చోట రక్షణ గోడలు నిర్మిస్తామన్నారు. వరదల్లో సకాలంలో అధికారులు స్పందించి హెచ్చరించారు..వరదల తరువాత సహాయ కార్యక్రమాలు వేగంగా చేశారని.. అధికారులను అభినందిస్తున్నానని వెల్లడించారు సీఎం జగన్.

No comments

Powered by Blogger.