Ap News: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్...!!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
ఉద్యోగులకు కొత్త డీఏ విడుదలకు ఆమోదం తెలిపినట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్) ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం గతంలో విడుదల చేసిన షెడ్యుల్‌కు అనుగుణంగా 2022 జనవరి నుంచి ఒక డీఏను జీతానికి జమ చేయనున్నట్లు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. ఈ ప్రతిపాదనకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని.. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని వెంకట్రామిరెడ్డి తెలిపారు.
No comments