AP News ఆ నిర్ణయం ప్రజలకే వదిలేసిన సీఎం జగన్....!!
ఏపీలో గత కొన్ని రోజులుగా వివాదాస్పదం అవుతున్న జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం పై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన క్యాంపు కార్యాలయంలో ఓటీఎస్ పథకం, గృహ నిర్మాణంపై ఆయన మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓటీఎస్ పూర్తిగా స్వచ్ఛందమేనని స్పష్టం చేశారు. దీని ద్వారా పేదలకు మంచి అవకాశం కల్పిస్తున్నామని, తీసుకోవాలా వద్దా అన్నది వారిష్టమని అన్నారు. ఈ పథకం ద్వారా పేదలపై రూ.10 వేల కోట్ల భారాన్ని తొలగిస్తున్నామని, గృహ నిర్మాణానికి పేదలు తీసుకున్న రుణాల్నీ ఓటీఎస్ ద్వారా మాఫీ చేస్తున్నామని రిజిస్ట్రేషన్ ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలు కాకుండా చాలా మంది చాలా రకాలుగా సమస్యలు సృష్టిస్తున్నారని, గతంలో వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదలనూ గత ప్రభుత్వం పరిశీలించలేదని అన్నారు.
సుమారు 43 వేల మంది గత ప్రభుత్వ హయాంలో అసలు, వడ్డీ కూడా కట్టారని.. ఇవాళ మాట్లాడుతున్నవారు... అప్పుడు ఎందుకు కట్టించున్నారు? అని జగన్ సూటిగా ప్రశ్న వేశారు. ఓటీఎస్‌పై అవగాహన కల్పించాలని, ప్రజలకు ఏ రకంగా మంచి జరుగుతుందో చెబుతూ, వారికి వివరించాలని అధికారులను సీఎం సూచించారు.
No comments