Latest

Loading...

AP News: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం...!!

AP News

 ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు, మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమిస్తూ గతంలో జారీ చేసిన జీవో నంబర్‌ 59ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.


జీవో 59పై దాఖలైన వ్యాజ్యాల విచారణ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.


ఈ విషయంలో డ్రెస్‌కోడ్‌ సైతం ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. మహిళా పోలీస్‌ సేవలను ఏవిధంగా వినియోగించుకోవాలనే విషయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని.. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు మరో వారం పాటు వాయిదా వేసింది.

No comments

Powered by Blogger.