Latest

Loading...

AP News ఏపీ ప్రజలకు శుభవార్త.. ఆ రుణాలు మొత్తం మాఫీ...! !

Ap news

 217 వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిన్న జరిగింది. ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో ఎస్‌ఎల్‌బీసీ సమావేశం జరిగింది.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ మాట్లాడుతూ… నిరుపేదల ఇళ్ళ నిర్మాణం కోసం రూ.35 వేల చొప్పున లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందాల్సి ఉందని… బ్యాంకులు ఇచ్చే రూ.35 వేల రుణాలపై లబ్ధిదారుల నుంచి కేవలం 3 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేయాలని పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు జగన్‌. 2,62,216 టిడ్కో ఇళ్లకు సంబంధించి కూడా బ్యాంకులు చొరవ చూపి రుణాలు మంజూరు చేస్తే, సమస్య పరిష్కారం అవుతుందన్నారు.


jagan

కోవిడ్‌ వల్ల ప్రభుత్వ ఆదాయం 2019-20లో రూ.8 వేల కోట్లు, 2020-21లో రూ.14 వేల కోట్లు తగ్గిందని… కోవిడ్‌ నివారణ, నియంత్రణ కోసం అదనంగా రూ.8 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ.30 వేల కోట్ల అదనపు భారం పడిందని… బ్యాంకింగ్‌ రంగం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని గట్టెక్కించగలిగిందని వెల్లడించారు.


కోవిడ్‌ కష్టకాలంలో రాష్ట్రాన్ని ఆదుకున్నందుకు బ్యాంకింగ్‌ రంగాన్ని అభినందిస్తున్నానని… బ్యాంకులు తమ మొత్తం నికర రుణంలో ప్రాధాన్యతా రంగాలకు నిర్దేశించిన దానికి మించి 59.5 శాతం రుణాలు ఇచ్చాయని…టర్మ్‌ రుణాల్లో వ్యవసాయ మౌలిక వసతులకు సంబంధించి వార్షిక రుణ ప్రణాళికలో ఈ ఆరు నెలల్లో 35.33 శాతం గా నమోదైందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల రుణ ప్రణాళికలో 37.31 శాతం మాత్రమే రుణాల్వివడం నిరాశజనకంగా ఉందని.. . మొత్తంలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాలు గత ఏడాది 42.50 శాతం కంటే ఈ ఏడాది 38.48 శాతం తగ్గాయని వెల్లడించారు

No comments

Powered by Blogger.