AP PRC: ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్- త్వరలోనే పీఆర్సీ....!!
CM Jagan assures announcement of PRC soon: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. పీఆర్సీ ప్రక్రియపూర్తయిందని..
మరో 10 రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తామని (CM Jagan on PRC) చెప్పారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్.. ఇవాళ తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలుసుకుని తమ సమస్యలను వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జగన్.. ఇప్పటికే పీఆర్సీ ప్రక్రియ పూర్తయినట్లు (PRC in AP) వెల్లడించారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన 10 రోజుల్లో ఉంటుందని హామీ ఇచ్చారు.
పీఆర్సీ రగడ..
రాష్ట్రంలో గత కొంత కాలంగా పీఆర్సీ విషయంలో ఇటు ప్రభుత్వం, అటు ఉద్యోగ సంఘాల మధ్య తీవ్ర చర్చలు జరగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు పలు మార్లు నిరసన కూడా వ్యక్తం చేశాయి. ఎట్టకేలకు ఈ విషయంపై నేడు క్లారిటీ వచ్చింది.
జగన్ పర్యటన ఇలా..
గత నెల రాయలసీమ సహా వివిధ ప్రాంతాల్లో కురిసి వర్షాలకు (AP rains) జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో చేపట్టిన సహాయక చర్యలను ముఖ్యమంత్రి జగన్ సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా. నేడు తిరుపతిలో పర్యటిస్తున్నారు.
వరదల కారణంగా (AP Floods) నష్టపోయిన బాధితులతో మాట్లాడి వారికి అందిన సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అందిరికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
No comments