Latest

Loading...

Arogyasree ఆరోగ్యశ్రీ పరిధిలోకి కేన్సర్ - జగన్ సర్కారు కీలక నిర్ణయం....!!

Arogyasree

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.


ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలోకి కేన్సర్ చికిత్సను చేర్చింది. ఇది అనేక మంది పేద కేన్సర్ రోగులకు ఎంతో ఉపశమనం కలగనుంది.

అలాగే, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కేన్సర్ బాధితులకు కేన్సర్ చికిత్స అందించేందుకు వీలుగా మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఏపీ సరైన కేన్సర్ ఆస్పత్రులు లేవు. దీంతో కేన్సర్ వ్యాధిబారిన పడిన రోగులు హైదరాబాద్ లేదా చెన్నైలకు వెళ్లాల్సి వస్తుంది.


ఒకవైపు కేన్సర్ చికిత్సకు భారీగా ఖర్చు చేయాల్సివుంది. దీనికితోడు పొరుగు రాష్ట్రాలకు వెళ్లడం మరింత భారంతో కూడుకున్నదిగా మారింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఏపీ సర్కారు ఆరోగ్య శ్రీ పరిధిలోకి కేన్సర్‌ను చేర్చింది.

No comments

Powered by Blogger.