Latest

Loading...

Black Raisins Benefits: నల్ల కిస్మస్ పండ్లతో కలిగే ప్రయోజనాలు అన్నీ....ఇన్నీ కావు...!!

Black Raisins Benefits

 Black Raisins Benefits: బ్లాక్ కిస్మస్ పండ్లు..కేవలం రుచికే కాదు. ఆరోగ్యపరంగా అత్యద్భుత ప్రయోజనాలున్నాయి. కిస్మస్ పండ్లతో కలిగే ఆ అద్భుత ప్రయోజనాలంటనేది తెలుసుకుందాం.


మనం తినే ఆహారంలో కిస్మస్ పండ్లు ఉండేట్టు చూసుకుంటే చాలా రకాల ఆనారోగ్య సమస్యల్నించి కాపాడుకోవచ్చు. కిస్మస్ పండ్లతో ఏయే రకాల అనారోగ్య సమస్యలున్నవారికి ప్రయోజనమో తెలుసుకుందాం. ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ బ్లాక్ కిస్మస్ పండ్లు తింటే చాలా మంచిది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. సాధారణ కిస్మస్ పండ్లతో పోలిస్తే..బ్లాక్ కిస్మస్‌లో అధిక ఔషధ గుణాలుంటాయి.


బ్లాక్ కిస్మస్(Black Raisins)పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తాయి. కంటిచూపును పెంచడంతో యాంటీ ఆక్సిడెంట్లు దోహదపడతాయి. కళ్లలోని కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది. బ్లాక్ కిస్మస్ పండ్లు తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. వ్యర్ధ పదార్ధాలు బయటకు పోతాయి. విషపదార్ధాలు నశిస్తాయి. ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశాలు తక్కువ. బ్లాక్ కిస్మస్ పండ్లతో రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఫలితంగా హైబీపీ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో అధికంగా ఉండే విటమిన్ సి కారణంగా జుట్టు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. తలలో చుండ్రు కూడా తగ్గుతుంది.


బ్లాక్ కిస్మస్‌లో పొటాషియం, కాల్షియం అధికంగా ఉండటంతో ఎముకలు ధృడంగా ఉంటాయి. ఆస్టియో పోరోసిస్, ఆర్ధరైటిస్ సమస్యలున్నవారు ప్రతిరోజూ కిస్మస్ పండ్లు తింటే చాలా మంచిది. అంతేకాకుండా శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా దోహదపడతాయి. కిస్మస్ పండ్లు నానబెట్టిన నీటిని తాగడం వల్ల బాడీ మెటబాలిజం స్థిరంగా ఉంటుంది. దంత సంబంధిత సమస్యల్నించి కూడా బ్లాక్ కిస్మస్ రక్షిస్తుంది. ముఖ్యంగా నోటి దుర్వాసన తగ్గుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా బ్లాక్ కిస్మస్‌లో ఉండే విటమిన్లు, మినరల్స్ శరీరంలో రోగ నిరోధకశక్తిని(Immunity Power)పెంచుతాయి. ఇందులో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిని పెంచేందుకు దోహదపడుతుంది. అధిక బరువును తగ్గించుకోవడంలో బ్లాక్ కిస్మస్ బాగా ఉపయోగపడుతుంది.

No comments

Powered by Blogger.