Latest

Loading...

జగన్ సర్కార్ కు షాక్.... మళ్లీ సమ్మె బాట పట్టనున్న ఏపీ ఉద్యోగులు....!!


 జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కు మరో షాక్ ఇచ్చేందుకు ఏపీ ఉద్యోగులు సన్నద్దం అవుతున్నారు. ఫిట్ మెంట్ పై జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఎటు తేల్చచకపోవడం తో..


మళ్లీ సమ్మె బాట పట్టనున్నారు ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీలు. ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీల స్ట్రగుల్‌ కమిటీ సమావేశంలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. పీఆర్సీ సహా వివిధ డిమాండ్లపై ప్రభుత్వం చేసే ప్రకటనలపై సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు జేఏసీల నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాస్.


తిరిగి ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సమావేశం లో పలువురు ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారని సమాచారం. పీఆర్సీ పై వారం రోజుల్లో స్పష్టత ఇస్తానని సీఎస్‌ హామీ ఇవ్వడంతో వేచి చూద్దామని మరికొంత మంది జేఏసీల నేతలు చెబుతున్నారు. వచ్చే నెల మూడో తేదీన ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవడానికి రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ సమావేశంలో సమ్మె బాటపై నిర్ణయం తీసుకొనున్నారు

No comments

Powered by Blogger.