Latest

Loading...

Bsnk closed ,బ్యాంకు ఖాతాదారులు అలర్ట్ - రెండు రోజుల సమ్మె : నేడు-రేపు..లావాదేవీలపై ప్రభావం..!

Bsnk closed

 బ్యాంకు ఖాతాదారులు అలర్ట్ అవ్వాల్సిన సమయం. ఈ రోజు..రేపు దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. దీంతో..ఖాతాదారుల లావాదేవీల పైన ప్రభావం పడనుంది.


రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ డిసెంబర్‌ 16, 17వ తేదీన సమ్మెను చేపట్టనున్నాయి. దీంతో ఆయా బ్యాంకుల కార్యాకలాపాలు రెండు రోజులపాటు నిలిచిపోనున్నాయి. ఈ సమ్మెలో సుమారు తొమ్మిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు పాల్టొంటారు.

ఇప్పటికే పలు బ్యాంకులు తమ ఖాతాదారులను అలర్ట్‌ చేశాయి. చెక్‌ క్లియరెన్స్‌, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ వంటి బ్యాంకు లావాదేవీలపై ప్రభావం చూపనుంది. పలు బ్యాంకులు తమ ఖాతాదారులను ముందే అప్రమత్తం చేశాయి. రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్‌ సంఘాలతో ఆయా బ్యాంకులు సమ్మెను విరమించాలని ఉద్యోగులను కోరాయి.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమ్మె సరికాదని, ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని వీటిని దృష్టిలో పెట్టుకొని సమ్మె విరమణపై నిర్ణయం తీసుకోవాలని సూచించాయి.


రెండు రోజుల పాటు సేవల పై ప్రభావం


మంగళవారం వివిధ అంశాలపై చర్చించేందుకు రావాలని ఉద్యోగ సంఘాలకు పిలుపునివ్వగా.. ఉద్యోగ సంఘాలతో చర్చలు విఫలమయ్యాయి. 2021-22 బడ్జెట్‌ సమావేశాల్లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రేవేటీకరణ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా డిసెంబర్‌ 16, 17 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మెను నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) జనరల్ సెక్రటరీ సంజయ్ దాస్ వెల్లడించారు. అంతేకాకుండా బ్యాంకుల ప్రైవేటీకరణతో ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.


పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ


సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లకు రుణ కేటాయింపులు ఇబ్బందికరంగా మారుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్ లైన్ బ్యాంకింగ్.. డిజిటల్ సేవల ద్వారా ఖాతాదారుల సేవల పై అంతగా ప్రభావం పడకున్నా.. ఏటీఎంల నిర్వహణ..చెక్ ల క్లియరెన్స్.. నగదు బదిలీ పైన మాత్రం ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఈ సమయంలో బ్యాంకు ఉద్యోగ సంఘాలు రెండు రోజుల పాటు చేస్తున్న ఈ సమ్మె పైన ప్రభుత్వం వారి డిమాండ్ల పైన సానుకూలంగా స్పందిస్తే ఒక రోజుకే సమ్మె పరిమతమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

No comments

Powered by Blogger.