Central govt | పండగలపై ఆంక్షలు.. నైట్‌కర్ఫ్యూ అమలు.. కేంద్రం తాజా మార్గదర్శకాలు...!
దేశంలో ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మొత్తం 16 రాష్ట్రాల్లో 269 కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
అన్ని రాష్ట్రాలకు తాజాగా కొన్ని సూచనలు చేసింది. పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్రభుత్వాలు సంసిద్ధమైపోవాలని స్పష్టం చేసింది. జిల్లాలు, పాజిటివ్ కేసులు, క్లస్టర్లపై కచ్చితంగా ఓ నిఘా వేసి ఉంచాల్సిందేనని స్పష్టం చేసింది. నిరంతరం అప్రమత్తంగా ఉంటూనే, అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని కూడా కేంద్రం సూచించింది. ఇంటింటికీ వెళ్లి టీకాలు ఇచ్చే విధానాన్ని అమలు చేయాలని, స్థానికంగా ఉండే పంగల విషయంలో ఆంక్షలు కూడా విధించాలని కేంద్రం పేర్కొంది. వీటితో పాటు మరికొన్ని కీలక సూచనలు కూడా కేంద్రం చేసింది.
నైట్ కర్ఫ్యూ విధించడం, గుమిగూడిన ప్రదేశాలపై ఓ కన్నేయడం, రాబోయే పండగలపై దృష్టి సారించడం, కంటైయిన్‌మెంట్, బఫర్ జోన్లను నిర్ధరించడం
పరీక్షల సామర్థ్యం పెంచడం, ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచడం, ఐసీఎంఆర్ మార్గదర్శకాలను పాటించడం, ఔషధాల స్టాక్‌ను పెంచుకోవడం
కేసుల విషయంలో పుకార్లు వ్యాప్తి కాకుండా చూసుకోవడం, ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు నిర్వహించడం
100 శాతం వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టడం, డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం
No comments