CM Jagan వెంకయ్య మనవరాలి రిసెప్షన్‌కు హాజరుకానున్న సీఎం జగన్...!!
ఈనెల 17న ఏపీ సీఎం జగన్ విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను జగన్ ప్రారంభించనున్నారు. సాయంత్రం 4:10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో విశాఖ వెళ్లనున్న ఆయన.
సాయంత్రం 5:10 గంటలకు ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్, వీఎంఆర్‌డీఏ అభివృద్ది చేసిన మరో ఆరు ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలకు విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ నెక్కలనాయుడు బాబు కుమార్తె దివ్యానాయుడు వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరవుతారు.
సాయంత్రం 6:20 గంటలకు ఉడా పార్క్ వద్ద జీవీఎంసీ అభివృద్ధి చేసిన మరో నాలుగు ప్రాజెక్టులను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సాయంత్రం 7 గంటలకు పీఎంపాలెం వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరవుతారు. అనంతరం రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి గన్నవరం తిరుగుప్రయాణం కానున్నారు.
No comments