CM Jagan: ఈరోజు ముఖ్య కార్యదర్శులతో సీఎం జగన్ భేటీ.. పీఆర్సీపై క్లారిటీ వచ్చే ఛాన్స్....!!
CM Jagan on PRC: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి రేపు కీలక భేటీ జరగనుంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎస్, ముఖ్య కార్యదర్శులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.
వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే పలుమార్లు ఉద్యోగ సంఘాలతో చర్చించారు సీఎస్. అయితే రేపటి సమావేశంలో PRCపై దాదాపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల అభిప్రాయాలను సీఎంకు వివరించనున్నారు అధికారులు. సీఎంతో భేటీ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగ సంఘాలకు ఇది గుడ్‌న్యూస్ అని చెప్పాలి. ఉద్యోగులతో సీఎం భేటీపై మంగళవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇదిలావుంటే ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించాలని ఏపీ ఉపాద్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వేతన సవరణ(PRC)టి కొన్ని డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగ 13 లక్షలమంది ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఉద్యోగుల సంఘం కోరింది.
11వ పీఆర్సీ అమలు చేయాలనేదే ప్రధాన డిమాండ్‌గా ఉంది. ఇప్పటి వరకూ 7 డీఏలు పెండింగ్‌లో ఉంచారన్నారని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే చాలా సార్లు కోరుతున్నాయి. వీటితో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ వంటి ఇతర డిమాండ్లు తెరపైకి తీసుకొచ్చాయి. తక్షణం ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
No comments