Latest

Loading...

Corona మీకు గతంలో కరోనా వచ్చిందా.? అయితే గుడ్ న్యూస్...!!

Corona

 మీకు గతంలో కరోనా వచ్చిందా.? అయితే గుడ్ న్యూస్.!


ఇండియాలో కరోనా కేసులకు సంబంధించి ఇప్పుడు ఆందోళన పెరుగుతున్న నేపధ్యంలో అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయాల మీద భారత ప్రజలు ఎక్కువగా ఫోకస్ చేసారు.



ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఏం జరగబోతుంది ఏంటీ అనే ఆందోళన పెరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మూడో వేవ్ కి కచ్చితంగా ఓమిక్రాన్ కారణం అవుతుంది అనే అభిప్రాయాలు ఉండగా మొదటిసారి స్ట్రెయిన్ కేసుని గుర్తించిన సౌత్ ఆఫ్రికా డాక్టర్ దీనిపై కీలక వ్యాఖ్యలు చేసారు.


కేసులు పెరుగుతున్నా సరే. దక్షిణాఫ్రికాలో చూసినట్లుగా చాలా మందిలో ఇన్‌ఫెక్షన్ స్వల్పంగా ఉంటుందని ఆ డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ అన్నారు. దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ చైర్‌పర్సన్ గా ఉన్న ఆయన. మరికొన్ని వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్ లు కచ్చితంగా ఓమిక్రాన్ ను కట్టడి చేస్తాయని వ్యాక్సిన్ తీసుకోలేదు అంటే మాత్రం కచ్చితంగా వంద శాతం రిస్క్ ఉంటుందని స్పష్టం చేసారు. ప్రిటోరియా నుండి ఫోన్ ఇంటర్వ్యూలో ఆయన మన జాతీయ మీడియాతో మాట్లాడారు.


కరోనా వచ్చి తగ్గిన వారికి ఓమిక్రాన్ నుంచి ఆందోళన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్‌లు వ్యాప్తిని తగ్గించడంలో బాగా సహాయపడతాయని. గతంలో కోవిడ్ వస్తే ఓమిక్రాన్ ఇప్పుడు వచ్చే అవకాశం 1/3 వంతు మాత్రమే కరోనా వస్తుందని అన్నారు. ఇక కరోనా భవిష్యత్తు గురించి మాట్లాడుతూ. అది కచ్చితంగా ఉంటుందని, కామన్ వ్యాధిగా మారిపోతుందని అన్నారు.

No comments

Powered by Blogger.