Curry Leaves Weight Loss కేవలం 7 రోజుల్లో అధిక బరువు,పొట్ట,నడుము చుట్టూ కొవ్వును మంచులా కరిగించి స్లిమ్ గా మార్చుతుంది...!!
Curry Leaves Weight Loss Tip : ఈ రోజుల్లో మారిన జీవనశైలి, వ్యాయామం చేయకపోవటం, సరైన డైట్ తీసుకు కోకపోవటం, ఎక్కువసేపు కూర్చొని ఉండటం వలన చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉన్నారు.
బరువు పెరగటం అనేది చాలా స్పీడ్ గా జరుగుతుంది. అదే తగ్గాలంటే కాస్త ఓపికగా ప్రయత్నాలు చేయాలి. చాలా మంది ఆదిక బరువు తగ్గించుకోవటానికి మార్కెట్ లో దొరికే మందుల మీద ఆదారపడతారు.
అలా చేస్తే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల సహజసిద్దంగా బరువు తగ్గించుకోవటానికి ప్రయత్నాలు చేయాలి. బరువు అనేది నిదానంగా తగ్గాలి. ఒక్క సరిగా ఎక్కువ బరువు తగ్గకూడదు. ఈ రోజు బరువు తగ్గటానికి ఒక డ్రింక్ తెలుసుకుందాం. దీని కోసం కరివేపాకు ఉపయోగిస్తున్నాం.
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి 4 కరివేపాకు రెమ్మల నుండి ఆకులను వేరు చేసి శుభ్రంగా కడిగి వేయాలి. 7 నుంచి 8 నిమిషాలు సిమ్ లో పెట్టి మరిగించాలి. అప్పుడే కరివేపాకులో ఉన్నపోషకాలు నీటిలోకి చేరతాయి. మరిగిన నీటిని గ్లాస్ లోకి వడకట్టి అరచెక్క నిమ్మరసం కలిపి తాగాలి.
కరివేపాకు బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కరివేపాకులో బీటా కెరోటిన్ అనే ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది.
నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ఒక ప్రత్యేక ఫైబర్ జీర్ణక్రియ బాగా జరిగేలా చూడటమే కాకుండా ఆకలిని నియంత్రించటానికి సహాయపడుతుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. శరీరంలో విషాలను బయటకు పంపుతుంది.
No comments