Cyclone Jawad: తరుముకొస్తోన్న జవాద్ తుపాను.. అతి భారీ వర్షాలు కురిసే అవకాసం....!!
జవాద్ తుపాను ఒడిశా వైపు ముంచుకొస్తోంది. డిసెంబర్ 5న పూరీ వద్ద జవాద్ తుపాను తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారినట్లు పేర్కొంది.
జవాద్ తుపాను వల్ల ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బంగాల్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తుపాను కారణంగా పలు తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది ఒడిశా ప్రభుత్వం. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని ఐఎండీ డైరక్టర్ జనరల్ మృత్యుంజయ మహోపాత్ర సూచించారు.
ఒడిశా- కేంద్రం కలిసి..
తుపాను ప్రభావం వల్ల కలిగే నష్టాన్ని వీలైనంత తగ్గించేలా ఒడిశా-కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయి. జవాద్ తుపాను ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోదీ నిన్న సమీక్షించారు
No comments