Diabetes: ఇలా చేస్తే..చక్కెర వ్యాధిని నెలరోజుల్లోనే నియంత్రించుకోవచ్చు..ట్రై చేసి చూడండి...!!
Diabetes: ఆధునిక జీవన విధానం తెచ్చిపెట్టిన ప్రధాన వ్యాధుల్లో ఒకటి డయాబెటిస్. దేశంలో అత్యధికంగా బాదపడుతున్న వ్యాధి కూడా ఇదే. అయితే అత్యంత సులభమైన వంటింటి చిట్కాతో ప్రమాదకరమైన చక్కెర వ్యాధిని నియంత్రించవచ్చు.
అదెలాగో తెలుసుకుందాం.
దేశంలో డయాబెటిస్ అనేది ఓ ప్రధాన సమస్యగా మారింది. డయాబెటిస్ కారణంగా ఇతర సమస్యలు తలెత్తి ప్రాణాంతకమవుతున్నాయి. అయితే డయాబెటిస్ ఎంత ప్రమాదకరమైనా చిన్న చిన్న వంటింటి చిట్కాలు(Best Home Remedy for Diabetes) పాటిస్తే అంతే సులభంగా నియంత్రించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఇంట్లో సర్వ సాధారణంగా ఉండే మెంతులతో(Fenugreek Seeds)ప్రమాదకర డయాబెటిస్ సమస్యకు చెక్ పెట్టవచ్చని భారతీయ వైద్య పరిశోధన మండలి నివేదిక చెబుతోంది.
డయాబెటిస్ నియంత్రణలు మెంతులు ఎలా పనిచేస్తాయి
మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో ప్రధానం ఉండేది పరిమితికి మించిన గ్లోకోజు. మెంతులు ఈ గ్లోకోజు(Glucose)పరిమాణాన్ని తగ్గిస్తాయి. ఎలాగంటే మెంతుల్లో దండిగా లభించే పీచు అంటే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ, పిండి పదార్ధాల గ్రహణను స్లో చేస్తుంది. రక్తంలో గ్లూకోజును ఒకేసారి కాకుండా నెమ్మదిగా కలిసేలా చేస్తుంది. ఫలితంగా గ్లూకోజు పరిమాణం అదుపులో ఉంటుంది. మెంతుల్లో ఉండే 4 హైడ్రాక్సిస్ ల్యూసిన్ అనే ఓ రకమైన అమైనో ఆల్కనాయిక్ యాసిడ్ ఇన్సులిన్ ఉత్పత్తిని(Insulin Production)పెంచడంతో పాటు శరీరంలోని కణాలు ఇన్సులిన్ స్వీకరించేలా చేస్తుంది. ఇన్సులిన్‌ను ప్రేరేపించే గుణం కలిగిన 2-ఆక్సోగ్లూటేట్ అణువులు సైతం మెంతుల్లో ఉంటాయి.ఇవన్నీ గ్లూకోజు అదుపులో ఉండటానికి తోడ్పడతాయి. మరోవైపు ఇందులోని సోపోనిన్స్ రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గటానికీ దోహదం చేస్తాయి.
మొత్తానికి మెంతులు క్రమం తప్పకుండా రోజూ తీసుకుంటే డయాబెటిస్‌ను(Diabetes)సులభంగా నియంత్రించుకోవచ్చనేది అందరూ చెప్పే మాట. ఎందుకంటే మెంతుల్లో ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లోవిన్, రాగి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మాంగనీసుతో పాటు ఎ, బి6, సి, కె విటమిన్ల వంటి పోషకాలున్నాయి.
మెంతులు ఎలా తీసుకోవాలి(How to take Fenugreek seeds)
మెంతుల్ని ఎలాగైనా తీసుకోవచ్చు. మెంతి పొడిని నేరుగా కూరల్లో కలిపి తీసుకోవచ్చు. లేదా పిండిలో కలిపి రొట్టెలు చేసుకోవచ్చు. అన్నింటికంటే ప్రధానమైంది, చక్కగా పనిచేసే విధానం రాత్రిపూట మెంతుల్ని నానబెట్టి..ఉదయం పరగడుపున ఆ మెంతుల్ని కాస్త క్రష్ చేసి..నీటితో సహా తాగడం. డయాబెటిస్ నియంత్రణకు(Diabetes control)ఇదే అత్యంత సులభమైన, మెరుగైన విధానంగా పెద్దలు చెబుతుంటారు. వేడినీటిలో ఓ పది నిమిషాలుంచి..తరువాత వడగట్టి తాగినా ప్రయోజనముంటుంది. కొంతమంది మెంతులతో టీ కాచుకుని తాగుతుంటారు.
No comments