Latest

Loading...

PF New Rule : ఈపీఎఫ్ ఖాతాదారులు డిసెంబర్ 31 లోగా ఈ పనిచేయకపోతే నష్టం తప్పదు...!!

PF New Rule

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (EPF Account) ఉన్నవారికి అలర్ట్. ఈపీఎఫ్ ఖాతాదారులు తప్పనిసరిగా తమ నామినీ వివరాలను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలి.

ఈ పనిచేయడానికి 2021 డిసెంబర్ 31 చివరి తేదీ. నామినీ వివరాలు అప్‌డేట్ చేయకపోతే ఈపీఎఫ్ఓ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కోల్పోవాల్సి ఉంటుంది. అందుకే ఈపీఎఫ్ ఖాతాదారులు వెంటనే తమ నామినీ వివరాలను ఈపీఎఫ్ అకౌంట్‌లో యాడ్ చేయాలి. ఈపీఎఫ్ఓ నుంచి పెన్షన్ బెనిఫిట్స్‌తో పాటు ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ కూడా వస్తాయని ఉద్యోగులకు తెలిసిందే. అయితే వాటిని నామినీకి అందించాలంటే నామినీ వివరాలు ఈపీఎఫ్ఓకు వెల్లడించడం తప్పనిసరి.
ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్స్‌కు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లభిస్తుంది. వారి మరణానంతరం నామినీలు కూడా పెన్షన్ పొందే సదుపాయం ఉంది. దీంతో పాటు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ (EDLI) స్కీమ్ ద్వారా ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు రూ.7 లక్షల వరకు ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా నామినీకి లభించేవే. పీఎఫ్ అకౌంట్‌లో దాచుకున్న డబ్బులు, ప్రతీ నెలా లభించే పెన్షన్, ఈపీఎఫ్ ఖాతాదారులు మరణిస్తే వచ్చే ఇన్స్యూరెన్స్ లాంటివాటన్నింటికీ నామినీ వివరాలు కావాల్సిందే. అందుకే నామినీ వివరాలు అప్‌డేట్ చేయాలని కోరుతోంది ఈపీఎఫ్ఓ.



No comments

Powered by Blogger.