Garlic వెల్లులితో కంట్రోల్ లోకి వస్తున్న షుగర్....
షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి వెల్లుల్లి చాలా మేలు చేస్తుంది. కేవలం షుగర్ మాత్రమే కాదు అనే వ్యాధులు కూడా వెల్లుల్లి వల్ల దరి చేరకుండా ఉంటాయి.
దీనిని రోజూ ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల అనేక వ్యాధుల నుండి మనల్ని రక్షించడమే కాకుండా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇది డయాబెటిక్ రోగులకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. మన దేశంలో లక్షలాది మంది మధుమేహంతో బాధపడుతున్నారు. డయాబెటిస్ అనేది ఒక రకమైన జీవక్రియ రుగ్మత. ఇది శరీరంలో ఇన్సులిన్ లేకపోవడం వల్ల సంభవిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
ఎందుకంటే ఆహారం, పానీయం కారణంగా రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది. దీంతో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. వెల్లుల్లి ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉంటుంది. వెల్లుల్లిలో ఉండే పోషకాలు శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడతాయి. వెల్లుల్లిలో ఉండే అమైనో ఆమ్లం హోమోసిస్టీన్ మొత్తాన్ని తగ్గించడంలో ,మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది రక్తంలో ఉండే చక్కెరను నియంత్రిస్తుంది.
ముందుగా, 100 గ్రాముల వెల్లుల్లి రసంలో ఉల్లిపాయ రసం, నిమ్మరసం, అల్లం రసం కలపండి. ఈ పదార్థాలన్నింటినీ బాగా మిక్స్ చేసి ఆపై ఉడికించాలి. ఇప్పుడు సమాన పరిమాణంలో తేనె జోడించండి. ఈ కషాయాన్ని ప్రతిరోజూ ఒక టీస్పూన్ తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర శాతం కంట్రోల్ లో ఉంటుంది. ఇది గుండె అడ్డంకిని తొలగించడంలో కూడా సహాయపడుతుంది. షుగర్ ఉన్నవారు 2 నుంచి 3 పచ్చి వెల్లుల్లి రెబ్బలను కూడా నమలొచ్చు. అధిక వేడి అనిపిస్తే వెల్లుల్లిని రాత్రిపూట నీటిలో నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో తినండి. ఇది కూడా చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవడం కష్టమే కాదు. ఇలా ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలతో షుగర్ కు చెక్ పెట్టొచ్చన్నమాట.
No comments