Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు అలెర్ట్.. ఇంటికి సిలిండర్ డెలివరీ చెయ్యాలంటే.! ఆ కోడ్ తప్పనిసరి....!!.
మీరు ఇండెన్ గ్యాస్ వినియోగదారులా.? తరచూ ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ వస్తుందా.? అయితే ఈ విషయం మీకోసమే.! వాస్తవానికి, ఇండియన్ ఆయిల్.. ఇండెన్ గ్యాస్ వినియోగదారులకు అనేక సేవలను అందిస్తోంది
అంతేకాకుండా గ్యాస్ సిలిండర్లు వినియోగదారుల ఇళ్లకు చేరేలా జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. ఇందుకోసం ఇండియన్ ఆయిల్ ప్రత్యేక కోడింగ్ సిస్టంను ఏర్పాటు చేసింది. అదే డీఏసీ(DAC) కోడ్. దీని ద్వారా మీరు ఇంటికి గ్యాస్ సిలిండర్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు. అసలు DAC కోడ్ అంటే ఏమిటి.? సిలిండర్ డెలివరీలో దాని పాత్ర ఏమిటి.? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
DAC అంటే ఏమిటి?
DAC అనేది ఒక రకమైన కోడ్, దీని పూర్తి పేరు డెలివరీ ప్రామాణీకరణ కోడ్. ఇండెన్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసిన సమయంలో.. ఈ కోడ్ SMS ద్వారా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది. ఇది ఒక విధంగా OTPగా పని చేస్తుంది. ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసేందుకు వచ్చిన వ్యక్తికి మీరు ఈ DAC చెప్తే, అతడు మీకు సిలిండర్ అప్పగిస్తాడు. దీనితో, గ్యాస్ సిలిండర్ హోం డెలివరీ ప్రక్రియ ముగుస్తుంది. DAC కస్టమర్ ఫోన్‌కు వచ్చే నాలుగు అంకెల కోడ్.
No comments