Latest

Loading...

Hacking Alert: ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక.. ఈ 7 యాప్స్ తో డేంజర్.. వెంటనే డిలీట్ చేయండి...!!

Hacking Alert

 ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ (Smart Phone) ఉంది. అంతేకాదు ప్రతి ఫోన్ కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్లు వివిధ రకాల యాప్స్ ను వినియోగిస్తుంటారు.


ఐతే కొన్ని రకాల యాప్స్ వల్ల వ్యక్తిగత సమాచారం లీకఅయ్యే అవకాశముంది. అంతేకాదుయూజర్ల బ్యాంక్ అకౌంట్ల నుంచి ఆటోమేటిక్ గా డబ్బులు కాజేసేందుకు హ్యాకర్లు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా జోకర్ మాల్వేర్ ను మన ఫోన్లలోకి చొప్పించి విలువైన పని పూర్తిచేస్తున్నారు. ఇటీవలి కాలంలో జోకర్ మాల్వేర్ బాధితుల సంఖ్య ఎక్కువైంది. అందుకే, ప్రముఖ సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ ప్రేడియో (Pradeo) ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లను అలర్ట్ చేస్తోంది. అధికారిక గూగుల్ ప్లే స్టోర్‌లోని కొన్ని యాప్‌లలో జోకర్ మాల్వేర్ చొరబడిందని, వెంటనే వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవాలని యూజర్లను హెచ్చరించింది. ఇప్పటికే 15 ప్రముఖ ఆండ్రాయిడ్ యాప్‌లకు జోకర్ మాల్వేర్ సోకినట్లు తెలిపింది.


గతేడాది జోకర్ మాల్వేర్ కారణంగా ఎంతో మంది డబ్బులు పోగొట్టుకున్నారు. దీన్ని గుర్తించిన గూగుల్ ఎంతో కష్టపడి ఆ మాల్వేర్ను తొలగించింది. అయినప్పటికీ, తన కోడ్ను మార్చుకొని గూగుల్ సెక్యూరిటీని కళ్లు గప్పి మరోసారి విరుచుకుపడుతోంది. మళ్లీ కొన్ని యాప్స్లోకి చొరబడుతోంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్స్కైలోని టత్యానా షిస్కోవా అనే అనలిస్టు గూగుల్లో 14 యాప్లకు జోకర్ మాల్వేర్ సోకిందని గుర్తు గతేడాది గుర్తి చేసింది.

ఈ జోకర్ మాల్వేర్ను 2017లో మొదటిసారి గుర్తించారు. ప్రతిసారి ఇది గూగుల్కే సవాలు విసురుతోంది. ప్రేడియో తాజా నివేదిక ప్రకారం, 'కలర్ మెసేజ్' అనే పాపులర్ యాప్ జోకర్ మాల్వేర్ బారిన పడింది. ఈ యాప్ను ప్రస్తుతం 5 లక్షలకు పైగా యూజర్లు వినియోగిస్తున్నారు. ఈ యాప్ రష్యన్ సర్వర్లతో అనుసంధానం అయినట్లు ప్రేడియో తన నివేదికలో పేర్కొంది.

జోకర్ మాల్వేర్ అంటే ఏంటి..? ఎందుకు ప్రమాదకరమైనది..?

జోకర్ మాల్వేర్ "ఫ్లీస్‌వేర్" విభాగానికి చెందినది. ఈ మాల్వేర్ మనకు తెలియకుండానే మన అకౌంట్ల నుంచి డబ్బులు కాజేస్తుంది. మనకు సంబంధం లేని, అవసరం లేని ప్రీమియం సర్వీసులకు క్లిక్స్, ఎస్ఎంఎస్ల ద్వారా సబ్స్క్రైబ్ చేయిస్తుంది. ఆటోమేటిక్గా ఆన్లైన్ యాడ్స్పై క్లిక్ చేసి అనుమతి లేకుండానే పెయిడ్ సర్వీసులకు డబ్బులు చెల్లిస్తుంది. మీ బ్యాంకు ఖాతాల్లోని బ్యాలెన్స్ చెక్ చేసేంత వరకు మీ డబ్బు పోయిందన్న విషయాన్ని మీరు గుర్తించలేరు. ఎందుకంటే, ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు మీ ఫోన్కు వచ్చే ఓటీపీని కూడా ఆటోమేటిక్గా రీడ్ చేస్తుంది.

జోకర్ మాల్వేర్ భారీన పడ్డ ఏడు యాప్స్ ఇవే..!

కలర్ మెసేజ్, సేఫ్టీ యాప్ లాక్, కన్వీనియెంట్ స్కానర్ 2, పుష్ మెసేజ్ టెక్ట్సింగ్ అండ్ ఎస్ఎంఎస్, ఎమోజీ వాల్పేపర్, సెపరేట్ డాక్ స్కానర్, ఫింగర్ టిప్ గేమ్బాక్స్. ఈ యాప్స్ గనుక మీ మొబైల్లో ఉంటే వెంటనే డిలీట్ చేయాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.

No comments

Powered by Blogger.