Latest

Loading...

Health Benefits పల్లిలతో గుండెకు ఎంతో మేలు...!!

Health Benefits

 శీతాకాలం వచ్చేసింది. సాయంకాలం చలిగిలి పెడుతున్నప్పుడు వెచ్చటి పల్లీలు తింటూఉంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుందనేవారు అనేక మంది. అయితే పల్లీలను తినటం వల్ల మంచి అనుభూతులు మిగలటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిదేనంటున్నారు శాస్త్రవేత్తలు.


పల్లీల తినటం వల్ల మనకు కలిగే లాభాలేమిటో చూద్దాం..


బాదం, వాల్‌నట్స్‌ వంటివి కొలస్ట్రాల్‌ తగ్గిస్తాయని.. గుండెకు మేలు చేస్తాయని చదువుతూ ఉంటాం. అయితే బాదం, వాల్‌నట్స్‌ కన్నా పల్లీలు గుండెకు ఎక్కువగా మేలు చేస్తాయి. ఇవి కొలస్ట్రాల్‌ను తగ్గించటంతో పాటుగా చిన్న చిన్న రక్త కణుతుల ఏర్పడకుండా నివారిస్తాయి. దీని వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.


పల్లీలలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కొవ్వు శాతం కూడా ఎక్కువే. అయితే పల్లీల వల్ల బరువు పెరగరు. క్రమం తప్పకుండా పల్లీలు తినేవారికి స్థూలకాయం వచ్చే అవకాశాలు తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.


పల్లీలలో ఐసోఫ్లోవాన్స్‌, రిసర్వట్రోల్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటుగా కాపర్‌, నియాసిన్‌, ఫోలోట్‌, మాంగనీస్‌, ఫాస్పరస్‌, మెగ్నిషియం, థైమైన్‌, విటమిన్‌ ఈ వంటివి కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటి వల్ల మనకు అనేక లాభాలుంటాయి.


పల్లీలలో గ్లైసమిక్‌ ఇండెక్స్‌ విలువ తక్కువ. అంటే వీటిని తినటం వల్ల శరీరంలోని బ్లడ్‌ షుగర్‌ విలువలు హఠాత్తుగా పెరగవు. తాజాగా జరిగిన అధ్యయనాల్లో పల్లీలు ఎక్కువగా తినే మహిళల్లో మధుమేహం (టైప్‌2) తక్కువగా వస్తుందని తేలింది. అంతే కాకుండా పల్లీలు కండరాల వాపును కూడా తగ్గిస్తాయి.

No comments

Powered by Blogger.