Latest

Loading...

Health Tips నరాల బలహీనతకు జామతో చెక్‌.. కానీ, అలా తింటే ప్రమాదమట....!!


నరాల బలహీనత.. నేటి కాలంలో ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ఏర్పడటానికి చాలా కారణాలే ఉన్నాయి. నరాల పటుత్వం కోల్పోయిన ఏ పని చేయలేకపోతుంటారు.


నరాలు బలహీనంగా మారినప్పుడు శరీరమంతా శక్తిహీనమైపోతుంది. అయితే నరాల బలహీనతను నివారించడంలో జామపండ్లు అద్బుతంగా సహాయపడతాయి. సాధారణంగా పిల్లల నుంచి పెద్దల వరకు జామపండ్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. రుచిలోనే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలోనూ జామ పండ్లు అద్భుతంగా సహాయపడతాయి. అయితే నరాల బలహీనత ఉన్న వారు ప్రతి రోజు జమపండ్లు లేదా జామపండ్లతో తయారు చేసిన జ్యూస్ తీసుకుంటే.. అందులో ఉండే పోషకాలు నరాల బలహీనతతో పాటు కండరాల బలహీనతను కూడా దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక జామతో మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మధుమేహం రోగులు జామపండు తింటే.. బ్లడ్ షుగర్ లెవల్స్ ఎప్పుడు అదుపులో ఉంటాయి. జామలో ఉండే విటమిన్ సి.. శరీర రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. అలాగే జామపండ్లు తినడం వల్ల శరీరానికి ఎన్నో విటమిన్లు, మినరన్లు, పీచు పదార్థం మరియు ఇతర పోషకాలు అందడమే కాకుండా.. ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది. దాంతో ఇతర ఆహారాలకు దూరంగా ఉండొచ్చు. ఫలితం అధిక బరువు నియంత్రణలోకి వస్తుంది. అయితే జామ ఆరోగ్యానికి మంచిదే.. కానీ కొందరు పచ్చిగా ఉండే వాటిని ఎక్కువగా ఇష్టపడి తింటుంటారు. కానీ, అలా చేయడం వల్లే ప్రమాదంలో పడతారట. ఎందుకంటే, పచ్చి జామకాయలో పాస్పరిక్,ఆక్సాలిక్ ఆమ్లాలు ఉండటం వలన వాటిని తింటే కడుపు నొప్పి మరియు ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తోంది. అలాగే ఎక్కువగా గింజలు ఉండే జామపండ్లను కూడా తీసుకోరాదు. వాటి వల్ల అపెండిసైటిస్ వచ్చే రిస్క్ ఉంటుంది. అందుకే ఎప్పుడూ దొరగా మరియు గింజలు తక్కువగా ఉండే జామపండ్లను ఎంపిక చేసుకుని.. తినాల్సి ఉంటుంది. అప్పుడే ఆరోగ్యానికి మంచిది.

No comments

Powered by Blogger.