Health Tips మాంసాహారం అతిగా తింటున్నారా.....అయితే ఈ జబ్బులు తప్పవు...!!
సాధారణంగా కొందరు మాంసాహారాన్ని వారానికి ఒకసారి తింటే.. కొందరు రెండు సార్లు తింటారు. అయితే ప్రతి రోజు నాన్ వెజ్ తినే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు.
ఇలాంటి వారికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అంటే మాంసాహారం లేనిదే ఏ రోజు కూడా భోజనం చేయలేరన్నమాట. వాస్తవానికి మాంసాహారం ఆరోగ్యానికి మంచిదే. ఎన్నో ప్రోటీన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు మాంసాహారం ద్వారా లభిస్తుంది. అయితే మంచిదే కదా అని రెగ్యులర్‌గా నాన్ వెజ్ తింటే.. ఎన్నో జబ్బుల బారిన పడాల్సి వస్తుంది.
ఏదైనా అతి అనర్థదాయకం. ఈ విషయంలో మాంసాహారానికి కూడా ఎలాంటి మినహాయింపు లేదుజ అతిగా మాంసాహారం తీసుకుంటే.. ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని స్వయంగా ఆరోగ్య నిపుణులే చెబుతున్నారు. మరి నాన్ వెజ్ అతిగా తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాలి అన్నది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం. మాంసాహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే అతిగా మాంసాహారం తీసుకున్నప్పుడు.. శరీరంలో అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్లు చేరతాయి. ఆ ప్రభావం ఎముకల ఆరోగ్యంపై తీవ్రంగా పడుతుంది.
అలాగే మాంసాహారంలో ఫైబర్ ఉండదు. అందువల్ల, రెగ్యులర్ మాంసాహారం తీసుకుంటే.. అది జీర్ణం కావడానికి ఎక్కువ సమయంలో తీసుకుని జీర్ణ వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తుంది. ఫలితంగా.. మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అదేవిదంగా, మాంసాహారం ఎక్కువగా తీసుకునే వారిలో తలనొప్పి, మానసిక ఒత్తడి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
ఇక అధిక బరువు పెరగడానికి అతిగా మాంసాహారం తీసుకోవడం కూడా ఒక కారణం. అవును, మాంసాహారం అతిగా తీసుకోవడం వల్ల.. అందులో ఉండే అధిక ప్రోటీన్లు శరీరంలో అదనపు కొవ్వును పెరుకుపోయేలా చేస్తాయి. ఫలితంగా, బరువు పెరిగిపోతారు. ఇక కాదు.. అతిగా మాంసాహారం తీసుకోవడం వల్ల.. అలసట, పెద్ద పేగుల క్యాన్సర్, శరీరం నుంచి దుర్వాసన వంటి జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి, మాంసాహారాన్ని అతిగా మాత్రం తీసుకోకండి.
No comments