Health Tips ప్రెజర్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా...? మరి మీకివి తెలుసా...!!
పూర్వం అందరూ అన్నంను పొయ్యి మీదే వండుకునే వారు. కానీ, ప్రస్తుత టెక్నాలజీ కాలంలో అన్నం వండుకునేందుకు ఎన్నో విధానాలు అందు బాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎసరు పెట్టి అన్నం వండడం మానేశారు.
దాదాపు చాలా మంది ప్రెజర్ కుక్కర్‌లో అన్నం పెట్టడాన్నే అలవాటు చేసుకున్నారు. ప్రెజర్ కుక్కర్‌లో అన్నం వండటం ఎంతో వేగంగా మరియు సులువుగా అయిపోతుంది. అయితే ప్రెజర్ కుక్కర్‌లో వండిన అన్నం తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? కాదా..? అసలు ప్రెజర్ కుక్కర్‌లో వండి అన్నం తినొచ్చా..? అన్న సందేహాలు చాలా మందికి ఉన్నాయి.
మరి మీ సందేహాలకు సమాధానాలు దొరకాలంటే ఇప్పుడు చెప్పబోయే విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం పదండీ.. ప్రెజర్ కుక్కర్‌లో వండిన అన్నం తినొచ్చా..? తినకూడదా..? అంటే తినమనే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా ప్రెజర్ కుక్కర్‌తో వండిన అన్నాన్ని తినడం వల్ల పలు అరోగ్య లాభాలను పొందొచ్చని అంటున్నారు. అన్నం తింటే బరువు పెరిగి పోతామన్న భయం ఎందరికో ఉంటుంది. కానీ, ప్రెజర్ కుక్కర్‌లో వండిన అన్నంలో పిండి పదార్థం తొలగి పోవడం వల్ల ఫ్యాట్ కంటెంట్ కూడా తగ్గుతుంది. అందు వల్ల ఈ అన్నం తింటే ఊబకాయం వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది. అలాగే ప్రెజర్ కుక్కర్‌లో వండిన అన్నం తింటే త్వరగా జీర్ణం అయిపోతుంది. దాంతో గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. ప్రెజర్ కుక్కర్‌లో వండిన అన్నంను తింటే నీరసం, అలసట వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. శరీరం యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటుంది. మరియు ప్రెజర్ కుక్కర్‌లో వండిన అన్నం తింటే శరీరానికి ప్రోటీన్ మరియు ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
No comments