Latest

Loading...

Health Tips అల్లం-తులసి టీతో ఎన్ని జబ్బులకు చెక్ పెట్టవచ్చో తెలుసా....!!


 అల్లం, తులసి రెండూ విడి విడిగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్న అల్లం, తులిసి విడి విడిగా కాకుండా కలిపి తీసుకుంటే ఎన్నో పోయోజనాలు పొందొచ్చు.


ముఖ్యంగా అల్లం-తులసి తో తయారు చేసిన టీ తాగితే అనేక జబ్బులకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. మరి ఆ వివరాలు ఏంటీ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్లాస్ వాటర్‌లో చిన్న అల్లం ముక్క, ఐదు నుంచి ఆరు తులసి ఆకులను వేసి బాగా మరిగించి వడగట్టుకోవాలి.


గోరువెచ్చగా అయిన తర్వాత ఈ టీని సేవించాలి. కావాలి అనుకుంటే తేనె కూడా ఈ టీలో మిక్స్ చేసుకోవచ్చు. ప్రతి రోజు ఉదయం పూట ఈ అల్లం, తులసి టీను తీసుకోవడం వల్ల ఇందులో ఉండే శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆస్తమా వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే శరీర రోగ నిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుంది. ఆడవారికి ప్రతి రోజు ఈ అల్లం, తులసి టీ తాగడం వల్ల.. వారిలో క్రాంప్స్, మూడ్ స్వింగ్స్, తలనొప్పి వంటి ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోం తాలుకు లక్షణాలను తగ్గిస్తుంది.


అలాగే నేటి కాలంలో చాలా మంది కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధ పడుతున్నారు. పిల్లల్లో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. అయితే కిడ్నీలో రాళ్లను కరిగించడంలో అల్లం, తులసి టీ అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి, రోజుకో కప్పు అల్లం, తులసి టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇక వికారం, వాంతులు సమస్యతో బాధ పడేవారు ఒక కప్పుడు అల్లం, తులసితో తయారు చేసి టీ తాగితే ఆ సమస్యలు దరిదాపుల్లో కూడా ఉండవు. ఇటీవల కాలంలో అధిక శాతం మంది ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలతో బాధ పడుతున్నారు. అయితే అలాంటి వారు అల్లం-తులసి టీ తాగితే.. అందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు క్షణాల్లోనే ఒత్తిడి, తలనొప్పి సమస్యలకు చెక్ పెడుతుంది. ఇక ప్రతి రోజు అల్లం-తులసి టీ తాగడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు.

No comments

Powered by Blogger.