Latest

Loading...

Health Tips పల్లీలతో అధిక బరువుకు చెక్‌.. ఎలాగంటే....!!

Health Tips

 ఇటీవల కాలంలో మారిన జీవన శైలి కారణంగా స్త్రీ, పురుషులు అధిక బరువు సమస్యతో తెగ సతమతమవుతున్నారు. ఆహారపు అలవాట్లలో మార్పు, శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి ఇలా అనేక కారణల వల్ల చాలా మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు


ఇక అధిక బరువు పెరిగాక.. స్లిమ్‌గా మారాలని చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావనే చెప్పాలి. అయితే బరువు తగ్గాలి అని ప్రయత్నించే వారు ఖచ్చితంగా తమ డైట్‌లో కొన్ని పల్లీలు (వేరుశెనగలు) చేర్చుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.


ఎందుకంటే.. ఇతర స్నాక్స్ తో పోల్చితే పల్లీల్లో క్యాలరీలు తక్కువ ఉంటాయి. అదే సమయంలో పల్లీలను స్నాక్స్‌గా తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో వేరే ఆహార పదార్థాలను తీసుకోలేరు. తద్వారా అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు. అలాగే న్యూట్రీషియంట్స్ అధికంగా ఉండే పల్లీలు తీసుకోవడం వల్ల.. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది



ఇక పల్లీలతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటిపై కూడా ఓ లుక్కేసేయండి. ప్రతి రోజు గుప్పెడు పల్లీలు తీసుకోవడం వల్ల.. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు మినిరల్స్ గుండె జబ్బులు రాకుండా రక్షిస్తాయి. అలాగే భోజనం చేసిన పావు గంట తర్వాత కొన్ని పల్లీలు తీసుకుంటే.. జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. కె, ఈ, బీ విటమిన్లు పుష్కలంగా ఉండే పల్లీలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి రెట్టింపవుతుంది.

అలాగే డిప్రెషన్‌, ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలను తగ్గించడంలోనూ పల్లీలు గ్రేట్‌గా సహాయపడతాయి. ఇక రోజుకు గుప్పెడు పల్లీలు తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు.. క్యాన్సర్ నివారిణిగా కూడా పని చేస్తుంది. ముఖ్యంగా పల్లీల్లో ఉండే ఫ్యాలీ ఫినోల్ యాక్సిడెంట్స్ స్టొమక్ క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. పల్లీల్లో క్యాల్షియం మరియు విటమిన్ డి కూడా దొరుకుతుంది. ఇవి ఎముకలను, దంతాలను దృఢంగా మారుస్తాయి.

No comments

Powered by Blogger.