Health Tips కుక్కర్ లో వండుతున్నారా.. అస్సలు వద్దు.. నష్టాలివే..!!
ప్రెషర్ కుక్కర్ లో ఈ మూడు పదార్థాలు వండటం వల్ల చాలా నష్టాలున్నాయట. అందులోనూ మూడు రకాల ఆహార పదార్థాలను ప్రెషర్ కుక్కర్ లో అస్సలు వండొద్దట. అవేంటో చూద్దామా!
ఈరోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రెషర్ కుక్కర్ తప్పకుండా ఉండే ఉంటుంది. ఏదైనా వంట లేటవుతుంది అనుకున్నప్పుడు కుక్కర్ లో వేసి వండేస్తారు. మాంసం, పప్పు, అన్నం.. ఉడకడానికి ఎక్కువ టైమ్ తీసుకునే ఫుడ్ ఐటమ్స్ వండటానికి చాలామంది కుక్కర్ నే వాడుతారు. అయితే.. కొన్ని వంటలు ప్రెషర్ కుక్కర్లో అస్సలు వండకూడదట. ఇందులో వండితే రుచి మాట దేవుడెరుగు.. వండిన ఆహారం విషపూరితంగా మారి ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపుతుందట. దీని ప్రభావం వెంటనే కనిపించకపోయినా.. స్లో పాయిజన్ లా శరీరమంతా మెల్లమెల్లగా పాకుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రెషర్ కుక్కర్లో వండే ఆహార పదార్థాలలో అన్నం ఒకటి. అయితే కుక్కర్లో అన్నం వండడం వల్ల అక్రిలమైడ్ అనే హానికరమైన రసాయనం ఏర్పడుతుంది. దీని ఎఫెక్ట్ దీర్ఘకాలంలో బైటపడి ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుంది.
ఎప్పుడో ఒకసారి అత్యవసరంగా వండాల్సి వస్తే కుక్కర్ లో వండితే పర్వాలేదు. కానీ.. రోజూ అందులోనే వండటం అలవాటైతే మాత్రం మీ ఆరోగ్యానికే ముప్పే అంటున్నారు నిపుణులు.
ప్రెషర్ కుక్కర్లో వండిన అన్నం తినడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉందట.
చాలామంది ఆలుగడ్డలను ప్రెషర్ కుక్కర్లో ఉడికించి.. ఐదు నిమిషాల్లో కూర వండటం పూర్తి చేస్తారు. అయితే.. కుక్కర్ లో ఉడకబెడితే ఆలూలోని టాక్సిన్లు విషపూరితంగా మారుతాయట.
బంగాళదుంపలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. అధికంగా స్టార్చ్ ఉండే ఆహార పదార్థాలను కుక్కర్లో అస్సలు వండకూడదు. దీర్ఘకాలికంగా కుక్కర్లో ఉడకబెట్టిన బంగాళాదుంపలను తినడం వల్ల క్యాన్సర్, న్యూరోలాజికల్ డిజార్డర్ వంటి అనే ఆరోగ్య వ్యాధులకు దారితీస్తుంది.
పాస్తా.. పాస్తాలో కూడా పిండి పదార్థం అధికంగా ఉంటుంది. అందుకే దీన్ని కూడా కుక్కర్లో వండకూడదు. దీన్ని కళాయిలోనే వండుకోవాలి. పాస్తాను కుక్కర్లో ఉడికించే అలవాటు మానుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
No comments