Latest

Loading...

Health tips పన్నీర్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా....!!.

Health tips

 ఇదివరకు కాలంలో పన్నీర్ ను ఆహారంలో చాలా తక్కువగా తీసుకునేవారు. అయితే ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త ఆహారపదార్థాల్లో చాలామంది పన్నీర్ ను తీసుకోవడం పరిపాటిగా మారిపోయింది


మరికొందరైతే ఈ పన్నీర్ ను మాత్రమే బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటున్నారు. ఇలా ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఓసారి చూద్దామా... ఇలా ప్రతి రోజు ఉదయమే పన్నీర్ ను తీసుకోవడం ద్వారా విటమిన్ డి, హెల్తీ ఫ్యాట్స్, అలాగే ఎముకలకు ఎంతగానో దోహదం చేసే క్యాల్షియం బాగా లభిస్తున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ పన్నీర్ ను మనం బయట కొనడం మాత్రమే కాకుండా, ఇంట్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. పాలను వేడి చేసి అందులో కాస్త నిమ్మరసం కలిపితే పన్నీర్ లభిస్తుంది.


పచ్చిగా ఉన్న పన్నీర్ ను తీసుకోవడం ద్వారా ఎముకలకు ఎంతో బలాన్ని చేకూరుస్తుందని, అలాగే జాయింట్ పెయిన్స్ ఉన్నవారికి కూడా వీటివల్ల ఎంతగానో మేలు చేకూరుతుందని చెబుతున్నారు. వీటితోపాటు పాచి పన్నీర్ ను తీసుకోవడం ద్వారా శరీరంలో చాలా సులువుగా జీర్ణక్రియ జరుగుతుందని ఏవైనా కాలేయానికి సంబంధించిన వ్యాధులు ఉన్న కానీ, త్వరగా తగ్గటానికి ఉపయోగపడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.


వీటిని తీసుకోవడం ద్వారా లభించే పోషక విలువల ద్వారా శరీరంలో అలసట అనేది ఉండదని, దీనితో రోజంతా యాక్టివ్ గా ఉండటానికి సహాయపడుతుందని తెలుపుతున్నారు. అయితే వీటిని చాలామంది పచ్చిగా కాకుండా ఏదైనా వంటలలో కలుపుకొని తినడానికి బాగా ఇష్టపడతారు. ముఖ్యంగా శాఖాహారులకు మంచి పోషక విలువలు అందించడానికి ఈ పన్నీర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పన్నీర్ తీసుకోవడం ద్వారా ఎలాంటి చెడు జరగదు కాబట్టి ప్రతి ఒక్కరూ పన్నీర్ తిని ఆరోగ్యంగా జీవించండి.

No comments

Powered by Blogger.