Latest

Loading...

Health Tips బాదాంపప్పు తింటే ఆ రోగం జీవితంలో రాదు.. రోజుకు ఎన్ని తినాలంటే...?

Health Tips

 బాదం పప్పు తినటం వల్ల ఆరోగ్యానికి కాదు మన శరీరాకృతికి, సౌందర్యానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. బాదం పప్పుని ప్రతిరోజు రాత్రి నీటిలో నానబెట్టుకుని ఉదయమే వాటిని తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.బాదం పప్పు ఎన్నో పోషక విలువలతో కూడి ఉంటుంది.


బాదం పప్పులో యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్, విటమిన్స్, పోలిక్ యాసిడ్ వంటి ఎన్నో ఆరోగ్యానికి ఉపయోగపడే పోషక విలువలు ఉన్నాయి. బాదంపప్పు లోనే విటమిన్ బి- సెవెన్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పూర్తిగా నివారిస్తుంది.


వయసు పైబడిన వారు బాదం పప్పు ప్రతిరోజు తినడం వల్ల అందులో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలోని ఎముకలకు కావలసిన బలాన్ని చేకూరుస్తుంది. బాదం నూనెను వెంట్రుకలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యను కంట్రోల్ చేసి జుట్టు ఒత్తుగా పెరగటానికి ఉపయోగపడుతుంది. బాదం నూనె వల్ల మన జుట్టుకు అవసరమైన పోషణ లభిస్తుంది. అలాగే మొటిమలు, మచ్చలు, కంటి కింద ఏర్పడే నల్లని చారలు మరియు ముడుతలు వంటి సమస్యలకు పరిష్కారం దొరికినట్టే.


బాదంపప్పును డైరెక్టుగా తినటం లేదా బాదంపాలు తాగటం వల్ల అది ఆంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి మన శరీరంలో దీర్ఘకాలిక రోగాలను కూడా తగ్గిస్తుంది. మనం రోజూ తీసుకునే ఆహారంలో బాదంపప్పును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

No comments

Powered by Blogger.