Health tips హాట్ వాటర్‌లో ఇంగువ కలిపి తాగితే....ఆయా జబ్బులు దూరం...!
ఇంగువ.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కూర, సాంబర్, పులిహోర వంటి వాటిలో చిటికెడు ఇంగువ వేస్తే.. వాటి రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకే మన భారతీయులు ఇంగువను వంటల్లో విరి విరిగా ఉపయోగిస్తుంటారు
అయితే వంటలకు మంచి రుచి, వాసన అందించడమే కాదు.. ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలను చేకూర్చడంలోనూ ఇంగువ్ గ్రేట్‌గా సహాయపడుతుంది. ముఖ్యంగా హాట్ వాటర్‌లో చిటికెడు ఇంగువ కలిపి ప్రతి రోజు సేవిస్తే.. ఎన్నో జబ్బులకు దూరంగా ఉండొవచ్చు.
ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి ఇంగువ ఎంతో మేలు చేస్తుంది. ప్రతి రోజు గోరు వెచ్చిన నీటిలో చిటికెడు ఇంగువ కలిపి సేవించాలి. ఇలా చేస్తే..ఇంగువలో ఉండే బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగు పరచడంలో సూపర్‌గా సహాయపడుతుంది. మరియు కళ్లు తరచూ పొడిబారకుండా కూడా ఉంటాయి.
అలాగే మహిళలు నెలసరి సమయంలో ఎదుర్కొనే కడుపు నొప్పిని నివారించడంలోనూ ఇంగువ ఉపయోగపడుతుంది. హాట్ వాటర్ లో ఇంగువ కలిపి తీసుకుంటే.. ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పి ఇట్టే పోతుంది. ఒత్తిడి, డిప్రెషన్, తలనొప్పి వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. మధుమేహం వ్యాధితో బాధ పడే వారికి ఇంగువ ఎంతో మేలు చేస్తుంది. ప్రతి రోజు వేడి నీటిలో ఇంగువు కలిపి తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
గ్యాస్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలకు చెక్ పెట్టడంలోనూ ఇంగువ ఉపయోగపడుతుంది. ఇంగువును హాట్ వాటర్ కలిపి భోజనం తర్వాత తీసుకుంటే.. జీర్ణ వ్యవస్థ పని తీరు పెరుగుపడుతుంది. మరియు జీర్ణ సమస్య కూడా దూరం అవుతాయి. ఇక హాట్ వాటర్‌లో ఇంగువ కలిపి ఉదయాన్నే తీసుకుంటే మూత్రాశయం మరియు మూత్రపిండాల్లో పేరుకుపోయిన మలినాలు, వ్యర్థాలు బయటకు పోతాయి.
No comments