Joint Pains Home Remedies 3 సార్లు తింటే మోకాళ్ళ నొప్పి,కీళ్ల నొప్పి,నడుమునొప్పి,రక్తహీనత,డయాబెటిస్ తొలగి 100 ఏళ్ళు జీవిస్తారు....!!
Joint Pains Home Remedies : ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతున్నారు. అలాగే ఎన్నో రకాల సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నారు.
ముఖ్యంగా ఈ మధ్య కాలంలో డయాబెటిస్, రక్తహీనత సమస్యలతో బాధపడే వారు అధికంగా కనబడుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం.
నల్ల శనగలు, బాదం, బెల్లం అనేవి నొప్పుల నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగలు, నాలుగు బాదం పప్పులు వేసి నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం బాదంపప్పులను తొక్కతీసి శనగలతో కలిపి తినాలి. ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క కూడా తినాలి.
ఈ మూడింటినీ ఇలా తినడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గడమే కాకుండా రక్తహీనత సమస్య కూడా తొలగిపోతుంది. డయాబెటిస్ ఉన్నవారికి నియంత్రణలో ఉంటుంది. బెల్లం కీళ్ల నొప్పులు తగ్గించడానికి, కండరాల దృఢత్వాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే బెల్లంలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్య తగ్గడానికి సహాయపడుతుంది.
శనగలు, బాదం ఈ రెండూ కూడా కీళ్లు మరియు కణజాలంలో మంట తగ్గించడానికి సహాయ పడటమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ మూడింటినీ వారంలో మూడు రోజులు తింటే సరిపోతుంది. ఉదయం సమయంలో అయినా తీసుకోవచ్చు. లేదా సాయంత్రం సమయంలోనైనా తీసుకోవచ్చు..
No comments