Latest

Loading...

Joint Pains Home Remedies రాత్రి పాలతో తీసుకుంటే..కీళ్లనొప్పులు,రక్తహీనత, శారీరక బలహీనత, గుండెపోటు,తిమ్మిరి అనేవి ఉండవు

Joint Pains Home Remedies

 Joint Pains Home Remedies in Telugu : ప్రస్తుతం మారిన పరిస్థితి కారణంగా మనలో చాలా మంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. సమస్య వచ్చినప్పుడు కంగారు పడవలసిన అవసరం లేదు.


చిన్న చిన్న సమస్యలకు ఇంటి చిట్కాలు సరిపోతాయి. ఈ రోజు కీళ్లనొప్పులు,రక్తహీనత ,శారీరక బలహీనత వంటి సమస్యలను తగ్గించటానికి ఒక రెమిడీ తెలుసుకుందాం. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది


దీని కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి కాస్త వేడి అయ్యాక 6 కిస్ మిస్ లను వేసి 5 నుంచి 6 నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన పాలను గ్లాస్ లో పోసి కిస్ మిస్ తింటూ పాలను తాగాలి. ఈ విధంగా 10 రోజుల పాటు తాగితే మీకు మంచి ఫలితం కనపడుతుంది.


ఈ పాలను ఏ సమయంలోనైనా తాగవచ్చు. ఉదయం సమయంలో తాగితే రోజంతా ఉషారుగా ఉంటారు. కిస్ మిస్ ని పాలల్లో ఉడికించినప్పుడు పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాల పరిమాణం పెరుగుతుంది. దాంతో ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులువంటి వన్నీ తొలగి పోతాయి.


రక్తహీనత సమస్య ఉన్నప్పుడు ఈ పాలను తాగితే రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. ఎందుకంటే దీనిలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. గుండెకి సంబంధించిన సమస్యలు, అధిక రక్తపోటు, తక్కువ రక్తపోటు వంటి వాటిని తగ్గిస్తుంది. ఎందుకంటే కిస్ మిస్ పాలలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఈ పాలను తాగితే శారీరక బలహీనత,అలసట, నిసత్తువ అన్ని తొలగిపోతాయి.

No comments

Powered by Blogger.