Mineral water మినరల్ వాటర్ తాగే ముందు ఇవి తెలుసుకోపోతే రిస్క్‌లో పడినట్టే...!!
మన శరీరానికి నీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన శరీరం జీవించాలంటే.. మనకు కావాల్సిన మూడు జీవనాధారాల్లో నీరు రెండొవది. ఇక శరీరంలో నీటి శాతం ఎప్పుడైతే తగ్గుతుందో..
వెంటనే రోగాలు మనల్ని చుట్టుముట్టేస్తాయి. అందుకే శరీరం డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలని నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. అనేక జబ్బులను నయం చేసే శక్తి నీరుకు ఉంది.
అయితే కొందరు నీరు తాగడం ద్వారానే జబ్బులు తెచ్చి పెట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో దాదాపు చాలా మంది స్వచ్ఛమైన నీటిని కాదని.. మినరల్ వాటర్ తాగడానికే ఇష్టపడుతున్నారు. అవే ఆరోగ్యానికి మంచిదని భావిస్తున్నారు. కాని, అది ఏ మాత్రం వాస్తవం కాదు. పంపునీరు తాగే పల్లెటూళ్లు కూడా మినరల్ వాటర్‌కే మొగ్గు చూపుతున్నారు.
వాస్తవానికి మినరల్ వాటర్‌లో అసలు మినరల్సే ఉండవు. అలాంటి నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మినరల్ వాటర్ తాగడం వల్ల మోకాలి నొప్పులు, కిడ్నీ సమస్యలు తలెత్తుతాయట. ఇక సాధారణంగా మినరల్ వాటర్‌ను ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ క్యాన్లలో స్టోర్ చేస్తుంటారు.
ఇలా ప్లాస్టిక్ వాటిల్లో స్టోర్ చేసిన వాటర్ తాగడం వల్ల శరీరానికి అవసరమయ్యే క్యాల్షియం, పాస్ఫరస్, సల్ఫర్, మెగ్నీషియం వంటి మినరల్స్‌ను మనం కోల్పోతాం. మరియు ఈ నీటిన తాగడం క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే మామూలు ఏ మంచినీరైనా సరే దానిని కాచి చల్లార్చి తాగమంటున్నారు. అయితే తప్పదు అనుకున్న పరిస్థితుల్లో మినరల్ వాటర్ తాగడం వల్ల ఏ సమస్యలు ఉండవు. కాని, డైలీ ఆ నీటితే తాగితే మాత్రం తిప్పలు తప్పవు.
No comments