Latest

Loading...

Mushrooms Health Benefits పుట్టగొడుగులతో క్యాన్సర్‌కు కళ్లెం....!!

Mushrooms Health Benefits

 క్యాన్సర్‌ బారినపడకూడదని భావిస్తున్నారా? అయితే ఆహారంలో పుట్టగొడుగులను చేర్చుకొని చూడండి. రోజుకు 18 గ్రాముల (నాలుగు టేబుల్‌ స్పూన్లంత) పుట్టగొడుగులు తినేవారికి క్యాన్సర్‌ ముప్పు 45% వరకు తగ్గుతున్నట్టు పెన్‌ స్టేట్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు గుర్తించారు. పుట్టగొడుగులను చాలాకాలంగా సూపర్‌ ఫుడ్‌గా భావిస్తున్నారు. వీటిల్లో ఎర్గోథియోనీన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ దండిగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌ నివారణకు తోడ్పడుతుంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌ బారినపడకుండా మంచి రక్షణ ఇస్తున్నట్టు తేలింది. దాదాపు అన్నిరకాల పుట్టుగొడుగుల్లోనూ ఎర్గోథియోనీన్‌ స్థాయులు ఎక్కువగానే ఉంటాయి. అన్నీ సమానంగానే రక్షణ కల్పిస్తాయి.

No comments

Powered by Blogger.