Latest

Loading...

Natural home remedies to cough అర స్పూన్ - దగ్గు,జలుబు,జ్వరం తగ్గటంతో పాటు మీ శరీరంలో ఇమ్యూనిటీని రెట్టింపు చేసే అద్భుతమైన చిట్కా...!!

Health Tips

 Natural home remedies to cough : ఏ కాలంలోనైనా వాతావరణం మారగానే. చాలా మందికి వ్యాపించే అనారోగ్య సమస్యల్లో దగ్గు, జలుబు అనేవి సాదరణం.


వాటిని లైట్ తీసుకుంటే చాలా అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. అందుకే వాటిని వెంటనే తగ్గించుకొనే మార్గాలు గురించి ఆలోచించాలి. దగ్గు,జలుబు వచ్చాయంటే ఒక పట్టాన తగ్గవు.


ఇవి లేకపోతె చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు ఫిల్ అవుతాం. గొంతులో తేడాగా ఉన్నా ముక్కులో గడబిడ ఉన్నా చాలా చిరాకుగాను, నిసత్తుగాను ఉంటుంది. దగ్గు,జలుబు తగ్గేదాకా ప్రశాంతత ఉండదు. ఇవి శరీరంలో సమస్యలకు కారణం అవుతాయి. దగ్గు,జలుబుతో పాటు తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఇలా ఒక్కొకటి వచ్చేస్తూ ఉంటాయి.కాబట్టి. దగ్గు, జలుబు రాగానే మనం అలర్ట్ అవ్వాలి. ప్రతీ చిన్న అనారోగ్యానికీ టాబ్లెట్లు వేసేసుకుంటే. మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. అందువల్ల శరీరానికి మందులు అలవాటు చేయకుండా కొన్ని ఇంటి చిట్కాల ద్వారా దగ్గు,జలుబును ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.


ఒక బౌల్ లో పావు స్పూన్ శొంఠి పొడి, పావు స్పూన్ మిరియాల పొడి, చిటికెడు పసుపు, ఒక స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఈ విధంగా 2 రోజుల పాటు తీసుకుంటే దగ్గు, జలుబు,గొంతు నొప్పి అన్నీ తగ్గుతాయి.


ఈ రెమిడీ కోసం ఉపయోగించిన మిరియాలు, శొంఠి,పసుపు, తేనె లలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ సెప్టిక్ లక్షణాలు దగ్గు,జలుబు, జ్వరం వంటి వాటిని తగ్గించటమే కాకుండా శరీరంలో వ్యాధినిరోదక శక్తిని పెంచుతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కూడా మన శరీరంలో వ్యాధినిరోదక శక్తి ఎక్కువగా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ రెమిడీని ఫాలో అవ్వండి.


శొంఠి పొడి, మిరియాల పొడి, పసుపు మార్కెట్ లో పాకెట్స్ లభ్యం అవుతాయి. కానీ మన ఇంటిలో తయారుచేసుకున్నవి వాడితే మంచిది. ఇక తేనె విషయానికి వచ్చేసరికి ఆర్గానిక్ తేనె వాడితే మంచి ఫలితం చాలా తొందరగా వస్తుంది.

No comments

Powered by Blogger.