Latest

Loading...

Nerves weakness home remedies వీటిని ఇలా తీసుకుంటే చాలు నరాల బలహీనత తగ్గటమే కాదు.. జన్మలో రాదు...!!

Nerves weakness home remedies

 Nerves weakness home remedies in telugu :సరైన పోషకాహారం తీసుకోకపోవటం, సరైన జీవనశైలి లేకపోవటం వంటి కారణాలతో శరీరం బలహీనం అవుతుంది. దాంతో నరాల బలహీనత కూడా వస్తుంది.


ఆ బలహీనత ముఖంలో స్పష్టంగా కనపడుతుంది. అలాగే ముఖం మీద ముడతలు కనపడతాయి. 25 సంవత్సరాల వయస్సులో కూడా ఎక్కువ వయస్సు ఉన్నవారిలా కనపడతారు.

శరీరంలో నొప్పి, చేతులు మరియు కాళ్ళలో నొప్పి, ఎముకలు, కీళ్ళలో నొప్పి, నడుములో నొప్పి ఉంటుంది మరియు ఇది వైవాహిక జీవితం మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే 40 ఏళ్ళ వయసులో కూడా 25 ఏళ్ల వయస్సులో ఉండే చురుకుదనాన్ని కలిగి ఉండటమే కాకుండా నరాల బలహీనత,శారీరక బలహీనత వంటివి అసలు ఉండవు.


ఒక కప్పులో పావు కప్పు ఒట్స్, 10 కిస్ మిస్ వేసి దానిలో పాలను పోయాలి. పాలను వాడటం ఇష్టం లేనివారు నీటిని వాడవచ్చు. వీటిని 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టాలి. ఈ ఒట్స్ మిశ్రమాన్ని ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. ఉదయం సమయంలో తీసుకుంటే రోజంతా ఉషారుగా ఉంటారు.


సాయంత్రం సమయంలో తీసుకుంటే 4 నుంచి 5 గంటల మధ్యలో తీసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవచ్చు. ఇలా పది రోజులు తీసుకుంటే శరీరంలో బలహీనత తగ్గి చురుకుగా ఉషారుగా ఉంటారు. నరాలు బలంగా,ఆరోగ్యంగా ఉంటాయి. నరాలలో నొప్పులు కూడా తగ్గుతాయి.

No comments

Powered by Blogger.