బ్రేకింగ్ : మహారాష్ట్రలో కొత్తగా 7గురికి ఒమిక్రాన్...!!
ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు కరోనా డెల్టా వేరియంట్ నుంచి బయటపడుతున్న తరుణంలో దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజలను మరోసారి భయాందోళనకు గురి చేస్తోంది.
డెల్లా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. అయితే ఈ డేంజరస్ వైరస్ భారత్‌లోకి కూడా ఎంటరైంది. అయితే నిన్నటి వరకు కర్ణాటకలో 2, గుజరాత్‌లో 1, మహారాష్ట్రలో 1, ఢిల్లీలో 1 చొప్పున మొత్తం దేశవ్యాప్తంగా 5 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. అయితే తాజాగా మహారాష్ట్రలో మరో 7గురుకి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు.
దీంతో ఒక్కసారిగా మహారాష్ట్రలో కలకలం రేగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 12కు చేరింది. ఒమిక్రాన్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒమిక్రాన్‌పై పోరాటానికి అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు కలిసి నడవాలని ప్రభుత్వాలు ఇప్పటికే ప్రజలకు సూచనలు చేశాయి. అయితే ఒమిక్రాన్‌పై అవగాహన పెంచుకుని కరోనా నిబంధనలు పాటించి భారత్‌లో థర్డ్‌వేవ్ రాకుండా ఉండేందుకు ప్రజలు సహకరించాల్సిందే. లేకుంటే ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయిన ప్రభుత్వాలు మరింత నష్టపోక తప్పదు.
No comments