Latest

Loading...

Omicron Symptoms : ఒమిక్రాన్ లక్షణాలివే...నిర్లక్ష్యం వద్దు...!!

Omicron Symptoms

 Omicron Symptoms : ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.


కర్నాటకలో రెండు కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. బెంగళూరులో రెండు కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శని లవ్ అగర్వాల్ ప్రకటించారు. దేశంలో ఒమిక్రాన్ మరింత ప్రబలే అవకాశం ఉందని.. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరించారు.


ఒమిక్రాన్ లక్షణాలు

– విపరీతమైన అలసట

– తేలికపాటి కండరాల నొప్పులు

– గొంతులో గరగర

– పొడి దగ్గు

– కొంతమందిలో మాత్రమే జ్వరం

– చికెన్‌ గున్యాకు, ఒమిక్రాన్‌కు చాలా వరకు ఒకే లక్షణాలు


ఎయిర్ పోర్టుల్లో కఠిన చర్యలు : –

మరోవైపు… ఒమిక్రాన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని ఎయిర్‌పోర్టుల్లో కఠిన చర్యలు అమలవుతున్నాయి. ప్రమాదం పొంచి ఉన్న జాబితాలోని దేశాల నుంచి వచ్చే పౌరులకు పరీక్షలు చేయడంతో పాటు కఠిన క్వారంటైన్ నియమాలు అమలవుతున్నాయి. ప్రయాణికులకు టెస్టులు చేసిన అనంతరం ఫలితం తేలకుండా ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లడానికి వీల్లేదని కండిషన్‌ పెట్టారు. టెస్టుల్లో నెగిటివ్ అని తేలితే ఏడు రోజుల హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంది. మహారాష్ట్రకు చేరుకునే ప్రయాణికులంతా తప్పనిసరిగా ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉండాలని నిబంధన పెట్టారు.

No comments

Powered by Blogger.