Latest

Loading...

Omicron ఊహించని రీతిలో ఒమిక్రాన్ విజృంభన...!!

Omicron

 కరోనా మహమ్మారి ప్రపంచానికి కంటి మీద కునుకులేకుండా చేసింది.


రూపు మార్చుకున్న ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. కొత్త వేరియెంట్ కరోనా ఇప్పటికే చాలా దేశాలకు వ్యాపించి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. ఒమిక్రాన్ వేరియెంట్ పట్ల జాగ్రత్తగా ఉండటంతో పాటు దాని కట్టడికి ప్రపంచదేశాలన్నీ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఈ ఏడాది నవంబర్ 24న సౌతాఫ్రికాలో తొలి ఒమిక్రామ్ కేసు నమోదైంది. డెల్టా వేరియెంట్ తో పోలిస్తే మరింత వేగంగా ఇది వ్యాప్తి చెందుతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. ఇప్పటి వరకు 77 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. గతంలో వెలుగులోకి వచ్చిన వేరియెంట్ల కన్నా ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందడంపై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనం పరిస్థితి తీవ్రతను పట్టించుకోవడం లేదని వాపోయారు. ఒమిక్రాన్ సోకిన వారిలో సాధారణ లక్షణాలే కనిపించినప్పటికీ అది వ్యాప్తి చెందుతున్న తీరు ఆరోగ్య వ్యవస్థకు మరో సవాల్ విసిరే ప్రమాదముందని టెడ్రోస్ హెచ్చరించారు.

No comments

Powered by Blogger.