Latest

Loading...

Omicron హమ్మయ్య.. ఒమిక్రాన్‌ను అడ్డుకునే ఔషధం వచ్చేసింది.....!

Omicron

 ప్రపంచ దేశాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట.. ఒమిక్రాన్‌. ఈ కొత్త వేరియంట్‌ దెబ్బకు మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. కొన్నిచోట్ల ఆంక్షలు కూడా షురూ అయ్యాయి.



భారత్‌లోనూ కేసులు బయటపడడంతో ఆందోళన నెలకొంది. అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వేరియంట్‌కు సరికొత్త యాంటీబాడీ చికిత్సను బ్రిటన్‌లోని వైద్య నియంత్రణ సంస్థ ద మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ ఆమోదించింది.


సోత్రోవిమాబ్‌ అనే ఈ ఔషధాన్ని సింగిల్‌ మోనోక్లోనల్‌ యాంటీబాడీలతో తయారుచేశారు శాస్త్రవేత్తలు. ఇది ఒమిక్రాన్‌ లాంటి వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. ఇది సురక్షితమైన ఔషధమని, తీవ్రస్థాయిలో అనారోగ్యం ముప్పు ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.


సోత్రోవిమాబ్‌ను రక్తనాళాల ద్వారా 30 నిమిషాల పాటు అందిస్తారు. వ్యాధి లక్షణాలు అధికంగా ఉన్నప్పుడు ఆసుపత్రిపాలు కాకుండా, మరణం బారినపడకుండా 80 శాతం మేర ఇది రక్షిస్తుందని క్లినికల్‌ ట్రయల్స్‌లో గుర్తించారు. కరోనా లక్షణాలను గుర్తించిన వెంటనే ఈ ఔషధాన్ని ఇస్తే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు సైంటిస్టులు.

No comments

Powered by Blogger.