Latest

Loading...

Omicron భారత్ లో నాలుగుకు చేరిన కేసులు...!!

Omicron

 దేశంలో మరో ఒమిక్రాన్ కేసు నమోదయ్యింది. మహారాష్ట్రలో 33 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది


అతను ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్, ఢిల్లీ మీదుగా ముంబై వచ్చినట్లు చెప్పారు. అతను కళ్యాణ్-డోంబివాలి మునిసిపల్ ఏరియాలో నివసిస్తున్నాడని తెలిపారు. 12 మంది ప్రైమరీ కాంటాక్ట్స్, 23 మంది సెకండరీ కాంటాక్ట్స్ ను గుర్తించి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు ఆరోగ్య శాఖ అధికారులు. మరో 25 మంది తోటి ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా అందరికి నెగటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే అతను ఇంత వరకు ఎలాంటి కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదని గుర్తించారు. మహారాష్ట్రలో ఇది మొదటి కేసు కాగా..దేశంలో నాల్గో ఒమిక్రాన్ కేసు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 1, గుజరాత్ జామ్ నగర్ లో 1, కర్ణాటకలో 2 కేసులు నమోయ్యాయి.

No comments

Powered by Blogger.