Latest

Loading...

Omicron ఒమిక్రాన్ నుంచి కోలుకున్న డాక్టర్‌కు మళ్లీ కరోనా...!!

Omicron

 దేశంలో మొట్టమొదట ఒమిక్రాన్ బాధితులైన ఇద్దరిలో ఒకరైన బెంగళూరు డాక్టర్ ఒమిక్రాన్ నుంచి కోలుకున్నప్పటికీ మళ్లీ కొవిడ్ బాధితులయ్యారు


పరీక్షించగా ఆయనకు కొవిడ్ పాజిటివ్ కనిపించింది. మరో ఒమిక్రాన్ బాధితుడు దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి. ఆయన అధికారులకు ఎలాంటి సమాచారం అందించకుండా ఇక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్‌కు చెందిన ఆ దక్షిణాప్రికా వ్యక్తి ఇక్కడ క్వారంటైన్‌లో ఉన్న తరువాత దుబాయ్‌కు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. ప్రస్తుతం బెంగళూరు డాక్టర్ ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారని బృహత్ బెంగళూరు మహానగర పాలికే అధికారి చెప్పారు. ఆరోగ్యశాఖ అధికారులకు ఎలాంటి సమాచారం అందించకుండా దక్షిణాఫ్రికా వ్యక్తిని ఎలా పంపించారని ఆ వ్యక్తి విడిది చేసిన ఫైవ్‌స్టార్ హోటల్ యాజమాన్యం, సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

No comments

Powered by Blogger.